Aja Ekadashi 2022: భాద్రపద మాసంలోని కృష్ణ పక్ష ఏకాదశిని అజ ఏకాదశి అంటారు. ఈ రోజున శ్రీమహావిష్ణువును పూజిస్తారు. ఈ అజ ఏకాదశి వ్రతాన్ని (Aja Ekadashi Vratam 2022) పాటించడం వల్ల మీకు అన్ని పాపాల నుండి విముక్తి లభిస్తుంది. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల అశ్వమేధ యాగానికి సమానమైన ఫలితాలు లభిస్తాయి. ఈ రోజున శ్రీహరితోపాటు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా ఉంటుంది. ఈ ఏడాది ఈ ఏకాదశిని ఆగస్టు 23వ తేదీన జరుపుకోనున్నారు. ఈ వ్రతం జరుపుకోవడానికి ఆగస్టు 23వ తేదీ ఉదయం 7:02 గంటల నుంచి ఆగస్టు 24వ తేదీ ఉదయం 5:09 గంటల వరకు శుభ సమయం.
పూజ విధానం
అజ ఏకాదశి నాడు ఉదయాన్నే లేచి స్నానం చేసి... విష్ణుమూర్తి చిత్రపటాన్ని పూజ మందిరంలో ప్రతిష్టించండి. అనంతరం ఉపవాస దీక్షను తీసుకోండి. తర్వాత దేవుడి ముందు దీపం వెలిగించండి. పండ్లును నైవేద్యంగా పెట్టండి. పువ్వులతో పూజలు చేయండి. అనంతరం లక్ష్మీదేవి కథను చదవి వినండి. చివరగా హారతి ఇచ్చి ప్రసాదాన్ని అందరికి పంచి పెట్టండి. తర్వాత ఉపవాస దీక్షను విరమించండి.
2 శుభయోగాలు
అజ ఏకాదశి నాడు సిద్ధి, త్రిపుష్కర యోగాలు ఏర్పడుతున్నాయి. ఈ రెండు యోగాలూ చాలా శుభప్రదమైనవి. ఈ యోగాలలో పూజలు చేయడం ఎంతో మంచిది. ఆగస్టు 23వ తేదీ ఉదయం నుంచి మధ్యాహ్నం 12.38 వరకు సిద్ధి యోగం ఉంటుంది. త్రిపుష్కర యోగం ఆగస్టు 24వ తేదీ ఉదయం 10:44 నుండి ఉదయం 05:55 వరకు ఉంటుంది.
Also Read: Surya Grah Gochar 2022: మీరు భారీగా డబ్బు సంపాదించాలంటే.. ఈ చిన్న పని చేయండి చాలు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook