Gorantla Madhav: న్యూడ్ వీడియో వ్యవహారంలో హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ చుట్టూ ఉచ్చు బిగిస్తోంది. తాజాగా ఈవ్యవహారంపై రాష్ట్రపతి కార్యాలయం స్పందించింది. ఇటీవల రాష్ట్రానికి చెందిన పలువురు మహిళా నేతలు..రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి దీనిపై ఫిర్యాదు చేశారు. ఇప్పుడా ఫిర్యాదును సీఎస్ సమీర్ శర్మకు రాష్ట్రపతి కార్యాలయం పంపింది. ఈవ్యవహారంలో తగిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది.
గోరంట్ల మాధవ్ ఆశ్లీల వీడియో అంశంపై రాష్ట్రానికి చెందిన డిగ్నిటీ ఫర్ ఉమెర్ జేఏసీ నేతలు ఢిల్లీకి వెళ్లారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధన్‌ఖడ్‌తోపాటు జాతీయ మహిళా కమిషన్, పలువురు కేంద్రమంత్రులను కలిసి వినతిపత్రాలు అందజేశారు. ఎంపీ గోరంట్ల మాధవ్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈవ్యవహారంలో రాష్ట్రపతి కార్యాలయం స్పందించడంతో వైసీపీ వర్గంలో కలవరం మొదలైంది.
ఈమేరకు ఏపీ సీఎస్‌కు పంపిణ లేఖ వివరాలను మహిళా జేఏసీ కన్వీనర్ చెన్నుపాటి కీర్తికి రాష్ట్రపతి కార్యాలయం సమాచారం అందించింది. ఇటీవల హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ ఆశ్లీల వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పోస్ట్ చేసిన కాసేపటికే విపరీతంగా ట్రెండ్ అయ్యింది. ఈవ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది. వీడియోలో ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్‌గా ఉన్న దృశ్యాలు కనిపించాయి.
ఇందులో మహిళతో అసభ్యకరంగా మాట్లాడుతూ ఉన్న దృశ్యాలు ఉన్నాయి. ఈ వ్యవహారం రాజకీయంగా దుమారం రేపింది. ఎంపీ గోరంట్ల మాధవ్ చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ పెరిగింది. దీంతో ఆయన క్లారిటీ ఇచ్చారు. దీనికి తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. కొందరు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. దీనిపై వైసీపీ అధిష్టానం స్పందించింది. వీడియో ఒరిజినల్ అని తేలితే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేసింది.
దీనిపై అనంతపురం పోలీసులు విచారణ చేపట్టారు. ఒరిజినల్ వీడియో బయటకు వచ్చిన తర్వాతే దీనిపై క్లారిటీ వస్తుందని స్పష్టం చేశారు. దీంతో ఆ వ్యవహారం చల్లారినట్లు కనిపించింది. ఐతే తాజాగా రాష్ట్రపతి కార్యాలయం స్పందించిడం చర్చనీయాంశంగా మారింది.
Also read:CM Kcr: జాతీయ రాజకీయాల్లో సీఎం కేసీఆర్ దూకుడు..31న బీహార్‌కు గులాబీ నేత..!
Also read:Viral Video: జనవరికి సరికొత్త స్పెల్లింగ్ చెప్పిన టీచర్, విద్యార్థులు..వీడియో వైరల్..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి