Gas Agency: గ్యాస్ ఏజెన్సీ డీలర్‌షిప్ కోసం చూస్తున్నారా..వెంటనే దరఖాస్తు చేయండి మరి

Gas Agency: బిజినెస్ చేయాలనే ఆలోచన ఉంటే ఇదే మంచి అవకాశం. మంచి లాభాలు ఆర్జించే బిజినెస్ ఇది. డీలర్‌షిప్ కోసం దరఖాస్తుల స్వీకరణ జరుగుతోంది. ఆ వివరాలు మీ కోసం..  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Sep 8, 2022, 09:13 PM IST
Gas Agency: గ్యాస్ ఏజెన్సీ డీలర్‌షిప్ కోసం చూస్తున్నారా..వెంటనే దరఖాస్తు చేయండి మరి

Gas Agency: బిజినెస్ చేయాలనే ఆలోచన ఉంటే ఇదే మంచి అవకాశం. మంచి లాభాలు ఆర్జించే బిజినెస్ ఇది. డీలర్‌షిప్ కోసం దరఖాస్తుల స్వీకరణ జరుగుతోంది. ఆ వివరాలు మీ కోసం..

వ్యాపారం చేసే ఆలోచన ఉంటే..గ్యాస్ సిలెండర్ డీలర్‌షిప్ మంచి ప్రత్యామ్నాయం కాగలదు. ఎందుకంటే ఇందులో లాభాలు బాగుంటాయి. గ్యాస్ సిలెండర్ల డీలర్‌షిప్‌తో చాలామంది బాగా సంపాదిస్తున్నారు. ఇప్పుడు మీ కోసం అలాంటి అవకాశం ఎదురూచూస్తోంది. పెట్రో గ్యాస్ ఎనర్జీ ఇండియా లిమిటెడ్ ఈ డీలర్‌షిప్ అందిస్తోంది. వెంటనే అప్లై చేస్తే ఆ అవకాశం మీకు దక్కవచ్చు..

పెట్రో గ్యాస్ ఎనర్జీ ఇండియా లిమిటెడ్ అనేది పెట్రోలియం ఇంధనాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఇండియాలో భారీ స్థాయిలో కంపెనీ వ్యాపారాలున్నాయి. కంపెనీ తరపు నుంచి ఎల్పీజీ గ్యాస్ ప్రారంభించేందుకు డీలర్‌షిప్ ఇస్తున్నారు. తమ గ్యాస్‌ను ప్రతి ఇంటికి చేర్చేందుకు వ్యాపారాన్ని విస్తృతం చేస్తోంది కంపెనీ. ఇందులో భాగంగానే డీలర్‌షిప్ అందిస్తోంది. 

దరఖాస్తు ఎలా, అర్హతేంటి

ఈ కంపెనీ గ్యాస్ సిలెండర్ డీలర్‌షిప్ దరఖాస్తు చేసేవ్యక్తి భారతీయుడై ఉండాలి. దరఖాస్తుదారుడికి 10వ తరగతి సర్టిఫికేట్ ఉండాలి. అంతేకాకుండా వయస్సు 21 నుంచి 60 ఏళ్ల మధ్యలో ఉండాలి. దరఖాస్తుదారుడి కుటుంబసభ్యులెవరకూ ఆయిల్ కంపెనీ ఉద్యోగులై ఉండరాదు. 

డీలర్‌షిప్‌కు కావల్సిందేంటి

ఈ గ్యాస్ ఏజెన్సీ డీలర్‌షిప్ తీసుకుని నడపాలంటే ఖాళీ స్థలం లేదా పెద్ద గోడౌన్ లాంటిది ఉండాలి. చిన్న చిన్న స్థలంలో ఈ బిజినెస్ సాధ్యం కాదు. అంతేకాకుండా స్థలానికి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా ఉండాలి. ఈ  ఏజెన్సీ నడిపేందుకు పది మంది హెల్పర్లు అవసరం. దాంతోపాటు గోడౌన్ కూడా ఉండాలి.

ఈ బిజినెస్ ప్రారంభించేందుకు 5-10 లక్షల నగదు అవసరమౌతుంది. ఇతర వివరాల కోసం పెట్రో గ్యాస్ అధికారిక వెబ్‌సైట్ https://petrogas.co.in/ సంప్రదించి డీలర్‌షిప్ ఫామ్ నింపి సబ్మిట్ చేయాలి. ఆ తరువాత దరఖాస్తు స్క్రూటినీ అనంతరం కంపెనీ నేరుగా మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తుంది. ఇందులో ప్రాఫిట్ మార్జిన్ ఎక్కువే కాబట్టి బిజినెస్ బాగుంటుంది. 

Also read: 5G Services: ఎయిర్‌టెల్ 5జి సేవలు ఎప్పట్నించి ప్రారంభం, స్పీడ్ ఎంత ఉంటుంది

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News