Vastu Tips For Turtle: డబ్బుకు సంబంధించిన అనేక చిట్కాలు వాస్తుశాస్త్రంలో చెప్పబడ్డాయి. దీని ప్రకారం, ఇంట్లో తాబేలు విగ్రహం ఉంటే డబ్బుకు ఎప్పుడూ లోటు ఉండదని (Vastu Tips For Money) నమ్ముతారు. అందుకే చాలా మంది ఇళ్లలో, ఆఫీసుల్లో స్ఫటికం, రాగి, లోహం, వెండి మెుదలైన వాటితో చేసిన తాబేలును ఉంచుతారు. తాబేలు విగ్రహం ఇంట్లో ఉంటే ఆనందంతో పాటు ఆదాయం కుడా వస్తుంది. ముఖ్యంగా మెటల్ తాబేలను ఇంట్లో సరైన దిశలో ఉంచితే మీరు పాజిటివ్ ఫలితాలను చూస్తారు.
తాబేలును ఏ దిశలో ఉంచాలంటే...
>> వాస్తు శాస్త్రం ప్రకారం, పౌర్ణమి రోజున మాత్రమే ఇంట్లో తాబేలు తీసుకురావడం ఎల్లప్పుడూ శుభప్రదంగా భావిస్తారు. పౌర్ణమి నాడు తాబేలును పాలలో కాసేపు ముంచి ఉంచాలి.
>> అభిజిత్ ముహూర్తంలో ఈ తాబేలును పాలలో నుండి తీసి, నీటితో పూర్తిగా శుభ్రం చేయండి. దీని తరువాత, ఒక గిన్నెలో కొంచెం నీరు తీసుకుని అందులో తాబేలు ఉంచండి. ఇలా చేయడం వల్ల తాబేలు సానుకూల శక్తిని ప్రసారం చేస్తుంది.
>> తాబేలు నీటిలో నివసించే జంతువు. కాబట్టి తాబేలు ఉంచాల్సిన పాత్రను నీటి దిశలో అంటే ఈశాన్య దిశలో ఉంచాలి. దీని తరువాత 'ఓం శ్రీ కూర్మై నమః' మంత్రం 11 సార్లు జపించడం ప్రయోజనకరంగా ఉంటుంది.
>> తాబేలును ఇంట్లో ఉంచేటప్పుడు, తాబేలు నోరు లోపలికి ఉండేలా చూసుకోండి. ఇంటి నుంచి బయటకు వెళ్లే దిశలో తాబేలు ముఖాన్ని ఉంచవద్దు. ఇలా చేయడం వల్ల ప్రతికూల ఫలితాలు వస్తాయి.
>> తాబేలు విష్ణువు అవతారమని మత విశ్వాసం. సముద్ర మథనం సమయంలో తాబేలు పర్వతాన్ని మోసింది. తద్వారా మథనం సంపూర్ణం అయింది. వాస్తు శాస్త్రం ప్రకారం, ఇంట్లో తాబేలును ఉంచడం వల్ల సానుకూల శక్తి కమ్యూనికేషన్ పెరుగుతుంది. అలాగే మనిషి జీవితంలో ఎదురయ్యే సమస్యలన్నీ తొలగిపోతాయి.
Also Read: Surya Gochar 2022: సెప్టెంబర్ 17 నుండి ప్రకాశించనున్న ఈ రాశుల వారి అదృష్టం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook