Dengue Tips: వర్షాకాలం..చలికాలం అంటే చాలు డెంగ్యూ భయపెడుతుంటుంది. ప్రస్తుతం డెంగ్యూ కేసులు పెరుగుతున్న నేపధ్యంలో..డెంగ్యూ నుంచి సంరక్షణకై ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం..
వర్షాకాలం అంటే ఎంత చల్లగా, ప్రశాంతంగా ఉంటుందో వ్యాధుల పట్ల అంతే జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా డెంగ్యూ, టైఫాయిడ్, మలేరియా, వైరల్ ఫీవర్ల పట్ల చాలా అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా డెంగ్యూ విషయంలో చాలా కేర్ తీసుకోవాలి. చలికాలంలో కూడా అదే పరిస్థితి. ప్రస్తుతం డెంగ్యూ కేసులు పెరుగుతున్నాయి. డెంగ్యూ నియంత్రణకై ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, ప్లేట్‌లెట్ కౌంట్స్ ఎంత ఉండాలనేది తప్పకుండా తెలుసుకోవాలి.
డెంగ్యూ కేసులు గత కొద్దిరోజులుగా ఎక్కువవుతోంది. డెంగ్యూ వచ్చిందంటే చాలు ప్లేట్‌లెట్ల సంఖ్య వేగంగా తగ్గిపోయి ప్రాణాంతకంగా మారుతుంది. డెంగ్యూలో ప్లేట్‌లెట్ కౌంట్ అనేది చాలా ముఖ్యమైనది. ప్లేట్‌లెట్స్ కౌంట్ ఎంత ఉండాలి, ఎలా ప్లేట్‌లెట్స్ కౌంట్ పెంచుకోవాలనేది ఇప్పుడు తెలుసుకుందాం. డెంగ్యూ కాకుండా ఇతరత్రా వ్యాధుల్లో కూడా ప్లేట్‌లెట్స్ కౌంట్ తగ్గిపోతుంటుంది. అందుకే ప్లేట్‌లెట్ కౌంట్ కీలక భూమిక పోషిస్తుంటుంది.
ప్లేట్‌లెట్ కౌంట్ ఎంత ఉండాలి
డెంగ్యూ సోకినప్పుడు గంట గంటకూ కౌంట్ పడిపోతుంటుంది. వెంటనే ప్లేట్‌లెట్ కౌంట్ తగ్గినప్పుడు రోగికి రక్తస్రావం లేదా అంతర్గత రక్తస్రావం జరిగే అవకాశముంటుంది. అటువంటప్పుడు ప్లేట్‌లెట్స్ ఎక్కించకపోతే ప్రాణాలకే ప్రమాదం ఏర్పడుతుంది. సాధారణంగా ఆరోగ్యవంతుడైన మనిషి శరీరంలో ప్లేట్‌లెట్ల సంఖ్య 3-4 లక్షల వరకూ లేదా ఇంకా ఎక్కువ ఉంటుంది. ఇది 80 వేల వరకూ పడిపోయినా ఎటువంటి నష్టం లేదు. కానీ 20 వేలకంటే దిగువకు పడిపోయినప్పుడు మాత్రం ప్రమాదకరంగా భావిస్తారు. రోగి ప్రాణాలకే ముప్పు ఏర్పడుతుంది. వెంటనే అదే గ్రూప్ బ్లడ్‌గ్రూప్‌కు సంబంధించి ప్లేట్‌లెట్స్ ఎక్కించాల్సి ఉంటుంది.
ప్లేట్‌లెట్ కౌంట్ పెరిగే మార్గాలు
సహజ పద్దతిలో ప్లేట్‌లెట్ కౌంట్ పెరిగే మరో పద్థతి ఉంది. తక్షణం శరీరంలో ప్లేట్‌లెట్స్ కౌంట్‌ను పెంచుతుంది. బొప్పాయి చెట్టు లేత ఆకుల రసం. ఇది చాలా సులభం. లేత ఆకుల్నించి ఎప్పటికప్పుడు కొద్దిగా రసాన్ని సేకరించాలి. 5 ఎంఎల్ నుంచి 10 ఎంఎల్ వరకూ ప్రతిరోజూ ఉదయం , రాత్రి తీసుకుంటే చాలా వేగంగా ప్లేట్‌లెట్ కౌంట్ పెరుగుతుంది. ఇతర మందులు వాడుతూ కూడా ఈ రసం తీసుకోవచ్చు. చాలామంది వైద్యులు కూడా ప్రస్తుతం ఇదే సూచిస్తున్నారు. ప్లేట్‌లెట్స్ కౌంట్ పెరగడానికి అద్భుతమైన హోమ్ రెమిడీ ఇది.వర్షాకాలం కావడంతో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరముంది.
Also read: Food Habits: ఉదయం వేళ పరగడుపున తినకూడని ఫుడ్స్ జాబితా ఇదే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook