Food For Good Cholesterol: ప్రస్తుతం చాలా మంది ఆధునిక జీవన శైలికారణంగా వివిధ రకాల సమస్యలతో బాధపడుతున్నారు. ఇదే క్రమంలో అనారోగ్యకరమైన ఆహారాలను తీసుకుని చెడు కొలెస్ట్రాల్ సమస్యల బారిన పడుతున్నారు. ఇది శరీరంలో పెరిగితే.. గుండెపోటు, క్యాన్సర్, రక్తపోటు వంటి వ్యాధులు కూడా ఉత్పన్నమయ్యే అవకాశాలున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే శరీరం ఆరోగ్యంగా ఉండడానికి తప్పకుండా కొలెస్ట్రాల్ చాలా అవసరం. శరీరంలో మంచి కొలెస్ట్రాల్ పెరగడం వల్లే ఇతర అనారోగ్య సమస్యలు దూరమవుతాయి. అయితే చెడు కొలెస్ట్రాల్‌కు, మంచి కొలెస్ట్రాల్‌కు దగ్గరి సంబంధాలున్నా.. తేడాలు మాత్రం వేరు. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే అనారోగ్య సమస్యలు వస్తాయి. మంచి కొలెస్ట్రాల్ పెరిగితే శరీరం దృఢంగా తయారవుతుంది. అయితే శరీరంలో మంచి కొలెస్ట్రాల్ పెరగాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..
కొలెస్ట్రాల్ పెంచడానికి ఇవి సహాయపడతాయి:
తృణధాన్యాలు:
తృణధాన్యాలు కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచేందుకు సహాయపడతాయి. వీటిల్లో శరీరానికి అవసరమైన ప్రోటీన్, ఫైబర్, కార్బోహైడ్రేట్లు, విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల బాడీకి మంచి ప్రయోజనాలు లభిస్తాయి. అయితే రోజువారి ఆహారంలో వీటిని తీసుకోవాలని నిపుణులు తెలుపుతున్నారు.
బీన్స్:
బీన్స్ వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు చేకూరుతాయి. వీటిని ఆహారంలో భాగంగా తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఇందులో ప్రోటీన్, కాల్షియం, ఐరన్, కెరోటిన్ వంటి పోషకాలు అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి ఇవి శరీరాన్ని వ్యాధుల నుంచి రక్షించడానికి సహాయపడతాయి.
డ్రై ఫ్రూట్స్:
జీడిపప్పు, పిస్తా, వాల్నట్ వంటి నట్స్‌లో కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో మంచి కొలెస్ట్రాల్‌ను పెంచడానికి సహాయపడుతాయి. అయితే రోజూ నట్స్ తీసుకుంటే గుండె, మెదడుకు సంబంధించిన వ్యాధులు వచ్చే ప్రమాదం ఉండదని నిపుణులు తెలుపుతున్నారు.
పండ్లు:
పండ్లు శరీరాన్ని దృఢంగా చేయడానికి, రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది. అందువల్ల ప్రతిరోజూ పండ్లను తీసుకుంటే.. శరీరంలో మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. అనారోగ్య సమస్యలు కూడా దూరమవుతాయి.
(NOTE: ఇక్కడ అందించిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు, దయచేసి వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Also Read: Chia Seeds: చియా సీడ్స్‌తో కేవలం 10 రోజుల్లో 2 కిలోల బరువు తగ్గొచ్చు..
Also Read: Seeds Benefits: రోజూ 15 గ్రాముల చియా గింజలు తీసుకుంటే చాలు.. కొవ్వు సమస్యలకు చెక్ పెట్టొచ్చు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook