Dark Foot Problem: కష్టపడి పని చేసేవారు ఎప్పుడు తమ పాదాలను వినియోగిస్తూ ఉంటారు. శరీర భాగం నిలబడి ఉండడానికి కీలకపాత్ర వహించేవి కేవలం పాదాలు మాత్రమే. కాబట్టి వాటిపై కూడా ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. తరచుగా పాదాల్లో దుమ్ము ధూళి పేరుకుపోయి వివిధ రకాల సమస్యలు వస్తూ ఉంటాయి. వేడి శరీరం గలవారి పాదాల్లో ఇలాంటి సమస్యలు ఎక్కువగా కనిపిస్తాయి. అయితే ఈ సమస్య నుంచి ఉపశమనం పొందడానికి కొన్ని ఇంటి చిట్కాలు ఉన్నాయి. వాటిని పాటించడం వల్ల ఈ సమస్యకు చెక్ పెట్టొచ్చని నిపుణులు చెబుతున్నాను.
చాలామంది ఈ సమస్య నుంచి ఉపశమనం పొందడానికి ఖరీదైన పార్లర్లో శుభ్రం చేయించుకుంటున్నారు. అయితే ఇకనుంచి ఎలాంటి ఖర్చు లేకుండా ఇంట్లోనే పలు చిట్కాలను ఉపయోగించి ఈ పాదాలపై ఉన్న దుమ్ముదూరిని శుభ్రం చేసుకోవచ్చు.
నల్ల పాదాలను ఎలా శుభ్రం చేసుకోవాలి..?:
>>ముందుగా ఒక కప్పు తీసుకొని అందులో 20 గ్రాముల శనగపిండిని తీసుకోవాలి ఆ శనగపిండిలో పసుపును కలిపి రెండు చెంచాల తేనెను కూడా పోసుకోవాలి. ఇలా ఇలా వాటిని మిక్స్ చేసి అందులో తగినన్ని నీటిని వేసి మిశ్రమంలో తయారు చేసుకోవాలి. ఇలా సిద్ధం చేసుకున్న మిశ్రమాన్ని పాదాలకు అప్లై చేసి అరగంటసేపు అలా ఆరనివ్వాలి. ఆ తర్వాత మంచి నీటితో పాదాలను శుభ్రం చేసుకుంటే త్వరలోనే మంచి ఫలితం పొందుతారు.
>>పాదాలను శుభ్రం చేసింది రెండో చిట్కా.. ఒక బౌల్లో ఒక కప్పు శనగపిండి తీసుకొని.. అందులో ఒక కప్పు పెరుగును వేసుకొని ఫైన్ గా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక టీ స్పూన్ నిమ్మరసం వేసి మిశ్రమాన్ని కలుపుకోవాలి. ఇలా తయారు చేసిన మిశ్రమాన్ని పాదాలకు చేతులతో మసాజ్ చేసి అరగంట నుంచి గంటసేపు అలానే ఉంచాలి. ఆ తర్వాత శుభ్రమైన నీటితో పాదాలను కడగాలి. ఇలా చేస్తే కేవలం ఐదు రోజుల్లోనే పాదాలను శుభ్రం చేసుకోవచ్చు.
>>పాదాల నుంచి మురికిని తొలగించేందుకు ఓట్స్ పిండిని కూడా వినియోగించవచ్చు. అయితే దీనికోసం ముందుగా కోట్స్ ని తీసుకొని మిక్సీలో గ్రైండ్ చేసి పిండిలా చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా చేసుకున్న పిండిని ఒక బౌల్లో తీసుకొని అందులో పెరుగును వేసి మిశ్రమంలో తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని రాత్రి పడుకునే ముందు పాదాలకు మసాజ్ చేసి 15 నిమిషాల పాటు అలానే ఉంచి చల్లటి నీటితో కడిగేయాలి ఇలా చేస్తే సులభంగా ఆ మురికి తొలగిపోతుంది.
(NOTE: ఇక్కడ అందించిన సమాచారం సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు, దయచేసి వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Also Read: Dussehra 2022: దసరా రోజు ఆయుధ పూజలో భాగంగా ఇలా చేయండి.. మీరు కోరిన కోరికలు తీరుతాయి..
Also Read: Dussehra 2022: శ్రీ రాజరాజేశ్వరిదేవిగా అమ్మవారు.. దర్శనానికి పోటెత్తుతున్న భక్తులు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook