Garlic For Cholesterol In Winter: వెల్లుల్లి ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో ఉండే పోషకాలు గుణాలు, ఔషధ గుణాలు వ్యాధులను నివారించేందుకు కీలక పాత్ర పోషిస్తాయి. వెల్లుల్లిలో యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్, విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. వెల్లుల్లిని ప్రతి రోజూ ఆహారంలో తీసుకుంటే అనేక వ్యాధులు దూరమవుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. శీతాకాలంలో వెల్లుల్లి తినడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా వీటిని ప్రతి రోజు చలి కాలంలో ఆహారంలో తీసుకుంటే సులభంగా అన్ని రకాల సీజనల్ వ్యాధుల నుంచి ఉపశమనం కలుగుతుంది. అంతేకాకుండా జలుబు, కొలెస్ట్రాల్, జీర్ణక్రియ వంటి అనేక వ్యాధులు కూడా సులభంగా దూరమవుతాయి. ముఖ్యంగా సీజన్ మారడం వల్ల వచ్చే తీవ్ర వ్యాధులు కూడా తగ్గుతాయి. కాబట్టి శీతాకాలంలో వెల్లుల్లి తినడం వల్ల ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు ఎంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ సమస్యలన్నీ చెక్:
చలి దూరంగా ఉంటుంది:
వెల్లుల్లిన్ని చలి కాలంలో తీసుకుంటే జలుబు, ఫ్లూ వంటి సమస్యలు సులభంగా దూరమవుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. వెల్లుల్లిలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ లక్షణాల అధిక పరిమాణంలో లభిస్తాయి. ఇవి జలుబు, ఫ్లూ వంటి వ్యాధులను దూరం చేసేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. వెల్లుల్లిని తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి పెరిగి జలుబు, ఫ్లూ కలిగించే బ్యాక్టీరియాతో పోరాడే శక్తి కలుగుతుంది.
గుండె సమస్యలకు చెక్:
చాలా మంది చలికాలంలో గుండె సంబంధిత వ్యాధుల బారిన పడుతున్నారు. అయితే ఈ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి తప్పకుండా ఆహారంలో వెల్లుల్లిని ఆహారంలో తీసుకోవాల్సి ఉంటుంది. వీటిని చలి కాలంలో ప్రతి రోజూ ఆహారంలో తీసుకుంటే అన్ని రకాల అనారోగ్య సమస్యలతో పాటు శరీరంలో చెడు కొలెస్ట్రాల్ కూడా సులభంగా తగ్గి.. గుండె సమస్యలు కూడా తగ్గుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
ఎముకలు దృఢంగా మారుతాయి:
ఆధునిక జీవన శైలి కారణంగా చాలా మంది యువకులు ఎముకల దృఢత్వాన్ని కోల్పోతున్నారు. అయితే ఈ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి వెల్లుల్లిని ఆహారాల్లో వినియోగించాల్సి ఉంటుంది. ఇందులో ఉండే గుణాలు ఎముకలు దృఢత్వాన్ని పెంచి అన్ని రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనాన్ని కలిగిస్తుంది. అంతేకాకుండా ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. కాబట్టి శరీరాన్ని ఇతర వ్యాధుల నుంచి ఉపశమనాన్ని కలిగిస్తుంది.
అల్జీమర్స్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది:
వెల్లుల్లిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడారనికి కీలక పాత్ర పోషిస్తుంది. అయితే ఈ సమస్యలతో బాధపడుతున్నవారు వెల్లుల్లిని తీసుకోవడం అల్జీమర్స్ ప్రమాదాన్ని నివారించవచ్చు. అంతేకాకుండా వీటిని ప్రతి రోజూ తీసుకుంటే జ్ఞాపకశక్తి కూడా బలపడుతుంది.
(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
Also Read: Post Office Scheme: ఈ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టండి.. భారీ లాభం పొందండి
Also Read: Prince OTT: 'ప్రిన్స్' ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి