Aadhaar Card Updates: ఆధార్ కార్డు విషయంలో కీలకమైన అప్డేట్ వెలువడింది. యూఐడీఏఐ ఆధార్ కార్డ్ విషయంలో కొత్తగా జారీ చేసిన అప్డేట్ ప్రకారం..పుట్టిన తేదీ, అడ్రస్, పేరు వివరాల్ని సులభంగానే మార్చుకోవచ్చు. ఆ వివరాలు మీ కోసం..
మీ సమీపంలోని ఆధార్ కేంద్రం వివరాలు కూడా సులభంగా తెలుసుకోవచ్చు. దీనికోసం https://bhuvan.nrsc.gov.in/aadhaar/ లింక్ క్లిక్ చేస్తే చాలు.
మీరు ఆధార్ కేంద్రానికి వెళ్లి ఆధార్‌లో అడ్రస్ మార్చుకునే బదులు ఈ ఆధార్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఐటీ రిటర్న్స్ కూడా అప్డేట్ చేసుకోవచ్చు.
మీరు మీ ఆదార్కార్డులో మీ పేరు, అడ్రస్, పుట్టినతేదీ వంటి వివరాల్ని అప్డేట్ చేయాల్సి ఉంటుంది. ఇవి అప్డేట్ కాకపోతే..ప్రభుత్వ పధకాల ప్రయోజనం అందదు.
యూఐడీఏఐ అధికారిక ట్వీట్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించింది. సులభంగా డెమోగ్రఫిక్ వివరాలైన పుట్టిన తేదీ, పేరు, చిరునామా, లింగం, మొబైల్ నెంబర్ వివరాల్ని కేవలం 50 రూపాయలతో మార్చుకోవచ్చు.
ఆధార్‌కార్డు హోల్డర్లకు గుడ్‌న్యూస్. యూఐడీఏఐ ఎప్పటికప్పుడు కొత్త అప్డేట్స్ జారీ చేస్తుంటుంది. ఫలితంగా యూజర్లకు ఏ విధమైన ఇబ్బంది ఎదురుకాదు. ప్రభుత్వ పనుల్ని సులభంగా చేసుకోవచ్చు.