Benefits Of Watermelon Seeds: ప్రతి మనిషి తన వైవాహిక జీవితం సంతోషంగా ఉండాలని కోరుకుంటాడు. అయితే ఆధునిక జీవన శైలి కారణంగా చాలా మంది శరీర బలహీనత సమస్యల బారిన పడుతున్నారు. కొందరిలోనైతే స్పెర్మ్ కౌంట్స్ సమస్యలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. అయితే ఈ సమస్యల నుంచి ఎంత సులభంగా ఉపశమనం పొందితే అంత మంచిదని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే స్పెర్మ్ కౌంట్స్ సంఖ్యను పెంచుకోవడానికి ఆరోగ్య నిపుణులు సూచించిన ఈ చిట్కాలను వినియోగించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఈ చిట్కాలను వినియోగించడం వల్ల అనారోగ్య సమస్యలు కూడా తగ్గుతాయి. ఆ చిట్కాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
పుచ్చకాయ గింజలను తప్పకుండా తినాలి:
మనం వేసవి కాలంలో తరచుగా పుచ్చకాయను తింటూ ఉంటారు. అయితే ఇందులో నీటి పరిమాణాలు అధికంగా ఉంటాయి. దీనిని తినడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా బాడీకి చాలా రకాల పోషకాల అందుతాయి. అయితే పుచ్చకాయ గింజలను తినడం వల్ల కూడా శరీరానికి చాలా రకాలు ఉపయోగపడుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
పుచ్చకాయ గింజలలో లభించే పోషకాలు ఇవే:
పుచ్చకాయ గింజల్లో ప్రోటీన్, సెలీనియం, జింక్, పొటాషియం, కాపర్ వంటి ముఖ్యమైన పోషకాలను కలిగి ఉంటాయి. కాబట్టి వీటిని క్రమం తప్పకుండా తినడం వల్ల శరీరానికి విటమిన్లు, ఖనిజాలు, మోనోశాచురేటెడ్ కొవ్వు ఆమ్లాలు, పాలీసాచురేటెడ్ కొవ్వు ఆమ్లాలు లభిస్తాయి. కాబట్టి వీటి తప్పకుండా ఆహారంగా భాగంగా తీసుకోవాల్సి ఉంటుంది.
పుచ్చకాయ గింజలను తినడం వల్ల కలిగే ప్రయోజనాలు:
>>పుచ్చకాయ గింజలను తినడం వల్ల స్పెర్మ్ కౌంట్ సంఖ్య సులభంగా పెరుగుతుంది. ఇందులో ఉండే సిట్రులిన్ రక్త ప్రసరణను మెరుపడానికి సహాయపడుతుంది.
ముఖ్యంగా పురుషులు సంతానోత్పత్తి సమస్యలతో బాధపడుతున్నవారు ఈ గింజలను ఆహారంలో తీసుకోవాల్సి ఉంటుంది.
>>పురుషుల పునరుత్పత్తి వ్యవస్థకు అవసరమైన జింక్ పరిమాణాలు అధికంగా ఉంటాయి. అంతేకాకుండా వీటిని ప్రతి రోజూ తినడం వల్ల స్పెర్మ్ నాణ్యత మెరుగుపడుతుంది.
>>పుచ్చకాయ గింజలలో గ్లూటామిక్ యాసిడ్, మాంగనీస్, లైకోపీన్, లైసిన్, అర్జినిన్ అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి ఇది లైంగిక సామర్థ్యాన్ని పెంచేందుకు కృషి చేస్తుంది.
(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
Also Read : Vijay Devarakonda ED : పాపులారిటీ ఉంటే ఇవన్నీ సైడ్ ఎఫెక్ట్స్ లాంటివి.. ఈడీ విచారణపై విజయ్ కౌంటర్లు
Also Read : Nara Brahmani Bike Riding : బాలయ్య కూతురా? మజాకా?.. బైక్ రైడర్‌గా నారా బ్రహ్మణి యాత్ర
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook