These Diesel Cars will soon be discontinued in India: వచ్చే ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుండి భారతదేశంలో వాహనాలకు కొత్త ఎమిషన్ నిబంధనలు అమలులోకి వస్తాయి. రియల్ టైమ్ డ్రైవింగ్ ఎమిషన్ నార్మ్స్ అంటే RDE అని వాటిని సంభోదిస్తున్నారు. దీనిని ఫేజ్ 2 BS6 ఎమిషన్ నార్మ్స్ అని కూడా పిలుస్తారు. ఈ రూల్స్ కారణంగా, చాలా కార్ బ్రాండ్లు తమ డీజిల్ వాహనాలను నిలిపివేయవలసి ఉంటుంది.
అలాగే వీటితో పాటు పెట్రోల్‌తో నడిచే వాహనాలు కూడా మునుపటి కంటే భిన్నంగా ఉండనున్నాయి. ఈ నిబంధనలకు అనుగుణంగా లేని ఎలాంటి మోడల్ కారు అయినా నిలిపివేయబడతాయి. ఈ నియమం అమల్లోకి వచ్చిన తర్వాత చాలా ఫేమస్ వాహనాలు నిలిపివేయబడతాయి, అందుకే మీరు వీటిలో దేనినైనా కొనుగోలు చేయాలనుకుంటే ఇప్పుడే కొనండి, లేకుంటే మీరు వాటిని తర్వాత కొనుగోలు చేయలేరు.
ఈ నియమం కారణంగా, ఏప్రిల్ 2023 నుండి 17 మోడల్స్ కార్లు నిలిచిపోనున్నాయి. రాబోయే కొద్ది నెలల్లో హోండా మరియు హ్యుందాయ్ కూడా డీజిల్ కార్లను మన మార్కెట్లో నిలిపివేస్తాయి. 1. హోండా సిటీ 2. హోండా WR-V 3. హోండా అమేజ్ 4. హ్యుందాయ్ ఐ20 డీజిల్ కార్లు ఇక మార్కెట్ లోకి రిలీజ్ కావు. హోండా కార్స్ ఇండియా భారత మార్కెట్ నుంచి డీజిల్ కార్లను నిలిపివేయనున్నట్లు సమాచారం.
ఇక ప్రస్తుతం, వాహనాలకు ఎమిషన్ స్థాయికి సంబంధించిన ల్యాబ్ పరీక్ష జరిగింది. ఈ స్థాయిని నిరంతరం తనిఖీ చేయడానికి, నాలుగు చక్రాల వాహనాలు, వాణిజ్య వాహనాలకు అవసరమైన పరికరాన్ని ఇన్స్టాల్ చేయడాన్ని ప్రభుత్వం ఇప్పుడు తప్పనిసరి చేసింది. అడ్వాన్స్ ఎమిషన్ నిబంధనల ప్రకారం, నాలుగు లేదా అంతకంటే ఎక్కువ చక్రాల వాహనాల్లో ఎమిషన్ స్థాయి పర్యవేక్షించడానికి వాహన తయారీదారులు ఈ పరికరాన్ని ఇన్స్టాల్ చేయడం ఇప్పుడు తప్పనిసరి అవుతుంది. దీంతో వాహనాల ధరలు కూడా కొంత మేర పెరగనున్నాయి.
అలాగే, చాలా డీజిల్ కార్లతో సహా చాలా కార్లు ఈ నియమాన్ని పాటించ లేకపోవడంతో నిలిపివేయబడతాయి. ఇక వాటిలో ఈ 17 కార్లు ప్రముఖమైనవి. మారుతి సుజుకి: ఆల్టో 800, టాటా: ఆల్ట్రోజ్ డీజిల్, రెనాల్ట్: క్విడ్, హ్యుందాయ్: i20 డీజిల్, వెర్నా డీజిల్, మహీంద్రా: మరాజ్జో, అల్ట్రాస్ G4, KUV100, నిస్సాన్: కిక్స్ 7, టయోటా: ఇన్నోవా క్రిస్టా పెట్రోల్, స్కోడా: ఆక్టేవియా, సూపర్బ్, హోండా: సిటీ 4 జెన్, సిటీ 5 జెన్ డీజిల్, అమేజ్ డీజిల్, జాజ్, WR-V కార్లు నిలిచిపోనున్నాయని తెలుస్తోంది.
Also Read: Malavika Mohanan Hot Photos: వింత డ్రెస్సులో మెరిసిన మాళవిక మోహనన్.. ఇదేం అరాచకం అయ్యా!
Also Read: Malaika Arora Hot Photos: లేటు వయసులోనూ ఘాటు ఫో జులతో చంపేస్తున్న మలైకా అరోరా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook.