Shanishchari Amavasya 2023: ప్రతి నెల కృష్ణ పక్షం చివరి రోజున అమావాస్యను జరుపుకుంటారు. ఈ అమావాస్య తిథి పూర్వీకులకు అంకితం చేయబడింది. ఈరోజున పూర్వీకులకు దానం, పిండప్రదానం చేస్తారు. ఇది మాఘ మాసంలో వస్తుంది కాబట్టి దీనిని మాఘ అమావాస్య లేదా మౌని అమావాస్య అని అంటారు. పైగా ఇది శనివారం వస్తుంది కాబట్టి దీనిని శనిశ్చరి అమావాస్య అని కూడా అంటారు. ఈసారి మౌని అమావాస్య జనవరి 21న జరుపుకోనున్నారు.
మౌని అమావాస్య ప్రాముఖ్యత
ఈ శనిశ్చరి అమావాస్య రోజున అద్భుతం జరుగనుంది. ఈరోజున శనిదేవుడు త్రికోణ రాశి అయిన కుంభరాశిలో సంచరించనుంది. అంతేకాకుండా ఇదే రోజు ఖప్పర్ యోగం,చతుర్గ్రాహి యోగం, షడష్టక్ యోగం, సమాసప్తక్ యోగాలు ఏర్పడుతున్నాయి. అమావాస్యల్లో మౌని అమావాస్యకు చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున జపం చేయడం, తపస్సు చేయడం, ధ్యానం చేయడం, మౌనంగా పూజించడం ద్వారా మనిషికి బాధలు, పాపాల నుంచి విముక్తి లభిస్తుంది.
తేదీ మరియు శుభ సమయం 2023
హిందూ క్యాలెండర్ ప్రకారం, మౌని అమావాస్య జనవరి 21, శనివారం ఉదయం 6:17 గంటలకు ప్రారంభమై.. జనవరి 22వ తేదీ తెల్లవారుజామున 2:22 వరకు ఉంటుంది. ఉదయ తిథి ప్రకారం, జనవరి 21వ తేదీ శనివారం మౌని అమావాస్య జరుపుకుంటారు. ఈ రోజున శని, సూర్యుడు, శుక్ర గ్రహాల కలయిక వల్ల ఖప్పర యోగం ఏర్పడుతోంది.
మౌని అమావాస్య నాడు యోగం మరియు నక్షత్రం
మౌని శనిచారి అమావాస్య నాడు పూర్వ ఆషాడ నక్షత్రం, ఉత్తరాషాడ నక్షత్రం, సర్వార్థ సిద్ధి యోగం, హర్ష యోగం, బ్రజ్ యోగం, చతుర్ పాద కరణ యోగం తదితరాలు ఏర్పడుతున్నాయి. అదే సమయంలో, ఈ సమయంలో చంద్రుడు శని యొక్క రాశిచక్రం మకరరాశిలో సంచరిస్తాడు. శనిదేవుడు భక్తులకు ఆ దేవుడి ఆశీస్సులు లభిస్తాయి. ఈరోజున కొన్ని చర్యలు చేయడం ద్వారా శనిదోషం నుండి బయటపడవచ్చు.
Also Read: Budha Surya Gochar 2023: అరుదైన రాజయోగం... ఈ 4 రాశులవారు ధనవంతులవ్వడం ఖాయం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి