Loan on Aadhaar Card Number: ఆధార్ కార్డుపై కేంద్రం 4.78 లక్షల రూపాయలు రుణంగా అందిస్తోంది అంటూ సోషల్ మీడియాలో ఓ వైరల్ మెసేజ్ అవుతోంది . కేంద్రం అందించే ఈ రుణం కోసం దరఖాస్కు చేసుకోవాలనుకున్న వారు ఈ కింది లింకుపై క్లిక్ చేయండి అంటూ ఆ మెసేజ్ చివర్లో ఓ లింక్ కూడా షేర్ చేస్తున్నారు. అయితే, ఆధార్ కార్డు నెంబర్ ఆధారంగా కేంద్రం రూ. 4.78 లక్షల రుణం అందిస్తున్న మాట నిజమేనా ? ఇందుల వాస్తవం ఉందా లేక మోసమా అనేదే చాలామంది మెదళ్లను తొలిచేస్తోన్న ప్రశ్న.
ఏ సందేహం లేని వారు, కేంద్రం నిజంగానే రుణం ఇస్తుందనే అవాస్తవ ప్రచారాన్ని నమ్మిన వారు ఆ లింక్ పై క్లిక్ చేసి, వారు అడిగిన సమాచారాన్ని ఇచ్చి నిలువునా మోసపోతున్నారు. ఈ నేపథ్యంలో ఎప్పటికప్పుడు ఇలాంటి ఫేక్ మెసేజులు, వదంతులు, సైబర్ మోసాలపై స్పందిస్తూ జనాన్ని చైతన్యవంతులను చేస్తోన్న ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఆఫ్ ఇండియా వారు తాజాగా ఈ ఆధార్ కార్డు నెంబర్ పై రుణం అంటూ వైరల్ అవుతున్న మెసేజ్ పైనా స్పందించారు.
ఆధార్ కార్డుదారులకు కేంద్రం రుణం అనే ప్రచారంలో నిజం లేదని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో స్పష్టంచేసింది. ఇదొక ఫేక్ మెసేజ్ అని.. ఇలాంటి లింక్స్ పై క్లిక్ చేసి వారు అడిగిన డీటేల్స్ ఇస్తే.. సైబర్ క్రైమ్ బారినపడి సైబర్ మోసగాళ్ల చేతిలో మోసపోతారని పిఐబి తేల్చిచెప్పింది. అంతిమంగా ఇందులో నిజం లేదని.. జనాన్ని మోసం చేసేందుకు సైబర్ నేరస్తులు ఉపయోగించే పద్ధతుల్లో ఇదొక ఫిషింగ్ మెసేజ్ అని పిఐబి ఫ్యాక్ట్ చెక్ విభాగం పేర్కొంది. ఇలాంటి లింక్స్ పై క్లిక్ చేసి మోసపోవద్దని పిఐబి హెచ్చరించింది.
It is being claimed that the central government is providing a loan of ₹4,78,000 to all Aadhar card owners#PibFactCheck
▶️ This claim is #fake
▶️ Do not forward such messages
▶️ Never share your personal/financial details with anyone pic.twitter.com/fMdLewGxsF
— PIB Fact Check (@PIBFactCheck) November 19, 2022
గతంలోనూ ఇలాంటి ఎన్నో ఫేక్ మెసేజులపై పిఐబి ఫ్యాక్ట్ చెక్ టీమ్ స్పందించి జనాన్ని సైబర్ మోసాల బారి నుంచి కాపాడిన సంగతి తెలిసిందే. అనేక సందర్భాల్లో పౌరులను అయోమయానికి గురిచేస్తోన్న ఇలాంటి ఫేక్ మెసెజెస్ పై క్లారిటీ ఇవ్వడంలో పిఐబి ఫ్యాక్ట్ చెక్ పౌరులకు ఎంతగానో సహాయపడుతోంది.
ఇది కూడా చదవండి : Salary Hikes in 2023: జీతాల పెంపుపై ప్రైవేటు ఉద్యోగులకు పెద్ద గుడ్ న్యూస్
ఇది కూడా చదవండి : Govt Employees Basic Salary: ప్రభుత్వ ఉద్యోగులకు బడ్జెట్ 2023 తరువాత సూపర్ గుడ్ న్యూస్ ?
ఇది కూడా చదవండి : Tata Punch, Baleno: మార్కెట్లోకి కొత్త కారు ఎంట్రీ.. ఇప్పుడు టాటా పంచ్, బలెనో పరిస్థితి ఏంటి ?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook