Weekly Horoscope 2023: వచ్చే వారం ఈ 5 రాశులకు అద్భుతంగా ఉండబోతుంది.. ఇక వీరికి లాభాలే లాభాలు..

Weekly Horoscope 2023: రాబోయే వారం ఈ 5 రాశుల వారికి అద్భుతంగా ఉండబోతోంది. వీరు కెరీర్ లో ఉన్నత స్థాయికి వెళతారు. ఆ అదృష్ట రాశులేంటో తెలుసుకుందాం.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 20, 2023, 03:57 PM IST
Weekly Horoscope 2023: వచ్చే వారం ఈ 5 రాశులకు అద్భుతంగా ఉండబోతుంది.. ఇక వీరికి లాభాలే లాభాలు..

Weekly Horoscope in Telugu 2023: జనవరి నాల్గో వారం కొన్ని రాశుల వారికి శుభప్రదంగా ఉండనుంది. జనవరి 23 నుండి జనవరి 29 వరకు గ్రహాల స్థానాల్లో మార్పులు కారణంగా కొన్ని రాశులవారు ప్రయోజనం పొందనున్నారు. ఈ వారం అదృష్ట రాశులేవో తెలుసుకుందాం. 

ఈ వారం ఈ రాశుల అదృష్టం ప్రకాశించనుంది
మిథునం (Gemini): ఈ వారం మిథునం రాశి వారు వృత్తి జీవితంలోనూ, వ్యక్తిగత జీవితంలోనూ ప్రయోజనం పొందుతారు. మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీరు వివిధ రకాలుగా లాభపడతారు. మీ ఆరోగ్యం బాగుంటుంది. వచ్చే 7 రోజులు సంతోషంగా ఉంటారు. 
సింహం (Leo): ఈ వారం మీరు ప్రజలకు సహాయం చేస్తారు. మీరు దాని నుండి ప్రయోజనం పొందుతారు. ఈ వారం మీకు ఆనందంతో పాటు శాంతి మరియు విశ్రాంతి లభిస్తుంది. మీరు మీ కుటుంబంతో మంచి సమయాన్ని గడుపుతారు. బిజినెస్ విస్తరించడానికి ఇదే మంచి సమయం.
కన్య (Virgo): ఈ వారం కన్యా రాశి వారికి అనేక రంగాలలో రాణిస్తారు. సుఖ సంతోషాలు లభిస్తాయి. అన్ని వైపుల నుండి సానుకూల వార్తలు అందుతాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. రోగాల నుండి విముక్తి లభిస్తుంది. కుటుంబం మరియు పిల్లలతో మంచి సమయాన్ని గడుపుతారు.  డబ్బు సమస్య తీరిపోతుంది. 

వృశ్చికం (Scorpio): ఈ వారం గ్రహాలు మరియు రాశుల స్థానం మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. కాస్త జాగ్రత్తగా నిర్ణయం తీసుకుంటే ప్రతి పనిలో విజయం సాధిస్తారు. ధనం లాభదాయకంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. అదృష్టం కలిసి వస్తుంది. 
ధనుస్సు (Sagittarius): పాత నిర్ణయాల మీరు లాభాలను గడిస్తారు. వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది.  ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. మీకు కావలసిన వస్తువులను కొనుగోలు చేసే అవకాసం ఉంది. పెట్టుబడి పెట్టడం వల్ల లాభం పొందుతారు. ప్రేమికులకు ఈ సమయం బాగుంటుంది. 

Also Read; Mangal Margi 2023: జనవరిలో మంగళదేవుడి సంచారం.. ఈ రాశులకు పండగే పండుగ.. డబ్బే డబ్బు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News