Tata Motors and Mahindra plans SUV Cars to rival Hyundai Creta: భారతదేశ మార్కెట్‌లో అత్యధికంగా అమ్ముడవుతున్న కార్లలో 'హ్యుందాయ్ క్రెటా' ఒకటి. 2015లో క్రెటా మార్కెట్‌లోకి రాగా.. అప్పటినుంచి హవా చూపిస్తోంది. మిడ్-సైజ్ ఎస్‌యూవీ సెగ్మెంట్ అయిన ఈ కారుకి ఇతర కంపెనీల నుంచి ఇప్పటివరకు పోటీ లేకపోయింది. అయితే కస్టమర్ల డిమాండ్‌ను అర్థం చేసుకున్న కొన్ని కంపెనీలు.. ఈ సెగ్మెంట్లో కొత్త కార్లను తీసుకొస్తున్నాయి. మారుతీ సంస్థ గ్రాండ్ విటారాను, టయోటా కంపెనీ అర్బన్ క్రూయిజర్ హైరైడర్‌ను మార్కెట్‌లో కి తీసుకొచ్చాయి. టాటా మోటార్స్ మరియు మహీంద్రా కూడా హ్యుందాయ్ క్రెటాకు పోటీగా తమ ఎస్‌యూవీలను తీసుకురావడానికి సిద్ధమవుతున్నాయి.
Tata Curvv:
టాటా మోటార్స్ ఇటీవలే ఆటో ఎక్స్‌పో 2023లో 'టాటా కర్వివ్' కాన్సెప్ట్‌ను ప్రదర్శించింది. ఈ కారు పెట్రోల్ మరియు ఎలక్ట్రిక్ పవర్‌ట్రెయిన్‌లోనూ అందుబాటులో ఉంటుందని కంపెనీ తెలిపింది. ఈ కారు Gen 2 (Sigma) ప్లాట్‌ఫారమ్‌లో రూపొందించబడుతుంది. ఈ కొత్త ఎస్‌యూవీలో డ్యూయల్ మోటార్ సెటప్ మరియు AWD (ఆల్-వీల్ డ్రైవ్) సిస్టమ్ ఇవ్వబడుతుంది. ఎలక్ట్రిక్ వెర్షన్‌లో దీని రేంజ్ 400-500కిమీల వరకు ఉంటుంది.
టాటా కర్వివ్ పెట్రోల్ వెర్షన్‌లో కంపెనీ కొత్త ఇంజిన్‌ను ఉపయోగించవచ్చు. ఈ ఎస్‌యూవీ ప్రత్యేకత ఏమిటంటే 'డిజైన్'. ముందు భాగంలో పొడవైన LED లైట్ ఇవ్వబడింది. హెడ్‌ల్యాంప్ త్రిభుజాకార ఆకారాన్ని పొందుతుంది. ఇది కాకుండా.. బాడీ క్లాడింగ్, స్క్వేర్డ్ ఆఫ్ వీల్ ఆర్చ్‌లు, కూపే లాంటి స్లోపింగ్ రూఫ్‌లైన్ మరియు నాచ్‌బ్యాక్ స్టైల్ బూట్ ఉన్నాయి.
New Mahindra SUV:
మిడ్-సైజ్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో మహీంద్రా కూడా కొత్త కారుని తీసుకురాబోతోంది. మహీంద్రా కంపెనీ తన రాబోయే కొత్త ఎస్‌యూవీ టీజర్‌ను ఇటీవల విడుదల చేసింది. ఇది హ్యుందాయ్ క్రెటాతో పోటీ పడగలదు. ఈ ఏడాది చివర్లో ఈ కారు మార్కెట్లోకి రానుంది. కొత్త మహీంద్రా ఎస్‌యూవీ.. నిటారుగా ఉండే విండ్‌షీల్డ్, వీల్ ఆర్చ్‌లు, స్ట్రెయిట్ రూఫ్‌లైన్ మరియు హంచ్‌బ్యాక్ రియర్‌ను కలిగి ఉంటుందని టీజర్ ద్వారా వెల్లడించింది. ఈ కారు మహీంద్రా యొక్క BE.05 EV కాన్సెప్ట్‌ను పోలి ఉంటుంది. ఇది గత సంవత్సరం ఆగస్టు 15న ఆవిష్కరించబడింది.
మహీంద్రా కొత్త ఎస్‌యూవీ.. ADAS, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీతో కూడిన పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ప్రీమియం ఆడియో సిస్టమ్, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ వంటి ఫీచర్లను కలిగి ఉంటుంది. ఇది పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఎంపికలతో రానుంది. ఈ మహీంద్రా ఎస్‌యూవీని ప్రతాప్ బోస్ నేతృత్వంలోని మహీంద్రా ఆటోమోటివ్ డిజైన్ యూరప్ (M.A.D.E) డిజైన్ చేస్తుంది.
Also Read: Vivo 5G Smartphone: వివో అత్యంత చౌకైన 5G స్మార్ట్‌ఫోన్.. సూపర్ లుకింగ్! ఎగబడి కొంటున్న జనాలు
Also Read: Jio Cheape Recharge Plan: జియో 'సూపర్' ప్లాన్.. ఎయిర్‌టెల్ వినియోగదారులు అసూయపడక తప్పదు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.