Krithi Shetty: ట్రెండీ లుక్‌లో కృతి శెట్టి.. చూపులతో మాయ చేస్తున్న బేబమ్మ

Krithi Shetty Photos: తొలి సినిమా ఉప్పెనతోనే బ్లాక్‌ బస్టర్ అందుకుంది కృతి శెట్టి. శ్యామ్ సింగ రాయి, బంగార్రాజు సినిమాలతో వరుస సూపర్ హిట్స్ తన ఖాతాలో వేసుకుంది. అయితే ఆ తరువాత బ్యూటీని వరుస ఫ్లాపులే పలకరించాయి.
 

  • Jan 25, 2023, 22:45 PM IST
1 /5

ఈ ముద్దుగుమ్మ నటించిన ది వారియర్, మాచర్ల నియోజకవర్గం, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి వంటి మూవీస్ వరుసగా బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టాయి.  

2 /5

ప్రస్తుతం కథల ఎంపికలో బేబమ్మ అచితూచి అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. స్టార్ డైరెక్టర్లు, స్టార్ ప్రొడ్యూసర్లు ఆఫర్లు ఇస్తున్నా.. కథ నచ్చకపోతే నిర్మోహమాటంగా నో చెబుతోందట.   

3 /5

తెలుగులో నాగ చైతన్య సరసన కస్టడీలో కృతి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. అదేవిధంగా మలయాళంలో టోవినో తోమస్ సరసన ఒక పీరియాడికల్ డ్రామాలో యాక్ట్ చేస్తోంది.

4 /5

రీసెంట్‌గా కస్టడీ మూవీ నుంచి బేబమ్మ ఫస్ట్ లుక్ పోస్టర్‌ రిలీజ్ చేయగా.. అభిమానులకు తెగ నచ్చేసింది.  

5 /5

మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటోంది ఈ అమ్మడు. తాజాగా షేర్ చేసిన పిక్స్‌పై మీరూ ఓ లుక్కేయండి.