Upper Back Pain: ప్రస్తుతం చాలా మంది కంప్యూటర్ ముందు విచ్చలవిడిగా గంటల తరబడి పనులు చేయడం వల్ల చేతి నొప్పులు, మెడ నొప్పుల బారిన పడుతున్నారు. ఇలాంటి సమస్యల కారణంగా చాలా మందిలో ఒళ్లు నొప్పులు కూడా సంభవిస్తున్నాయి. అంతేకాకుండా నిద్ర పోయే క్రమంలో చాలా రకాల నొప్పులు వస్తున్నాయని ఆరోగ్య నిపుణులకు ఫిర్యాదులు కూడా చేస్తున్నారు. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా పలు ఇంటి చిట్కాలు పాటించాల్సి ఉంటుంది. అంతేకాకుండా మెడ నొప్పులు రావడానికి ఇతర కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
మెడ ఎముక నొప్పి:
మెడలో అనేక ఎముకల ఉమ్మడి ఉంటాయి. మెడ చిన్న ఎముకల మీద మాత్రమే నిటారుగా ఉంటుంది. అయితే మెడలో తీవ్ర నొప్పులు ఉంటే తప్పకుండా వైద్యులను సంప్రదించాల్సి ఉంటుంది. లేకపోతే తీవ్ర సమస్యలకు దారి తీసే అవకాశాలున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
కండరాల నొప్పి:
చాలా మందిలో వంగి స్మార్ట్ ఫోన్స్ చూడడం వల్ల ఇలాంటి సమస్యలు వస్తున్నాయి. మెడ కండరాలలో నొప్పిగా ఉండడం వల్ల ఆ నొప్పులు భుజాల వరకు వెళ్తోంది. దీని కారణంగా మెడ కండరాలలో తీవ్ర సమస్యలు వస్తున్నాయి. కాబట్టి ఇలాంటి నొప్పులతో తరచుగా బాధపడేవారు తప్పకుండా చికిత్స పొందాల్సి ఉంటుంది. లేకపోతే తీవ్ర అనారోగ్య సమస్యలకు దారి తీసే ఛాన్స్ ఉంటుంది.
తలనొప్పి:
కొన్ని సార్లు మెడ నొప్పి ప్రభావం తలపై పడే ఛాస్స్ ఉంది. కాబట్టి ఇలాంటి నొప్పులతో బాధపడేవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్త పాటించడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. తల నొప్పుల కారణంగా కండరాలలో ఉద్రిక్తత కూడా మొదలవుతుంది. కాబట్టి ఇలాంటి సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి పలు చికిత్స తప్పనిసరి.
ముఖ ఉమ్మడి నొప్పులు:
ముఖ ఉమ్మడి అనేవి వెన్నుపూసలో ఒక భాగం. కొన్నిసార్లు కొందరిలో తీవ్రమైన నొప్పులు పుడుతూ ఉంటాయి. ఇలాంటి నొప్పులు ఉన్నవారిలో తల వంచినప్పుడు సమస్య తీవ్రమవుతుంది. ఈ నొప్పులు శరీరం మొత్తం వ్యాప్తి చెందే అవకాశాలున్నాయి. అంతేకాకుండా కొన్ని సార్లు దీని కారణంగా వివిధ రకాల దీర్ఘకాలిక వ్యాధులకు దారి తీసే ఛాన్స్ కూడా ఉందని నిపుణులు చెబుతున్నారు.
మెడ కండరాల దృఢత్వం:
ప్రస్తుతం చాలా మంది మెడను ఒక వైపు నుంచి మరో వైపుకు తిప్పుకోలేకపోతున్నారు. అయితే ఇలాంటి తీవ్ర నొప్పులు సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఉపశమనం కోసం వ్యాధులను సంప్రదించడం చాలా మంచిది. మెడ కండరాలలో దృఢత్వం కారణంగా ఇలాంటి సమస్యలు వస్తాయి. కాబట్టి పడుకునే క్రమంలో మంచి భంగిమలో పడుకోవడం చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు.
Also Read: CM Jagan Mohan Reddy: వ్యవసాయ కనెక్షన్లపై సీఎం జగన్ కీలక నిర్ణయం.. ఇక నుంచి మరింత వేగం
Also Read: Minister Gummanur Jayaram: మంత్రి గుమ్మనూరు కుటుంబంలో తీవ్ర విషాదం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి