Loss 8 Kg Weight In 10 Days with these Tips: ప్రస్తుతం చాలా మంది బరువు పెరగడం కారణంగా ఆందోళనకు గురవుతున్నారు. అంతేకాకుండా తీవ్ర అనారోగ్య సమస్యల బారిన కూడా పడుతున్నారు. అయితే ఇలాంటి సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి తప్పకుండా తీసుకునే ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. బరువు తగ్గడానికి తప్పకుండా డైట్ పద్ధతిలో మాత్రమే ఆహారాలు తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఊబకాయం సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి తప్పకుండా ఉదయం పూట పలు చిట్కాలను పాటించాల్సి ఉంటుంది. సులభంగా బరువు తగ్గడానికి ఉదయం పూట ఎలాంటి చిట్కాలు పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
ఉదయం లేచిన తర్వాత బరువు తగ్గడానికి తప్పకుండా ఈ చిట్కాలు పాటించాల్సి ఉంటుంది:
- నిద్ర లేచిన తర్వాత ఉదయాన్నే వాకింగ్ చేయడం వల్ల శరీరంలోని క్యాలరీలు తగ్గుతాయి. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు ప్రతి రోజూ 15 నుంచి 25 నిమిషాల పాటు నడవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో నీటిని కూడా తాగాల్సి ఉంటుంది.
- బరువు తగ్గే క్రమంలో తప్పకుండా శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకోవడం చాలా మంచిది. ప్రతిరోజూ ఉదయాన్నే నిద్రలేచి వ్యాయామం చేయండం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా కొలెస్ట్రాల్ స్థాయిలను కూడా నియంత్రించాల్సి ఉంటుంది.
- ఉదయం నిద్ర లేవగానే నీళ్లు తాగడం చాలా ముఖ్యం. ఇలా చేయడం వల్ల బరువు తగ్గుతారు. ప్రతి రోజూ నీటిని అతిగా తాగడం వల్ల శరీరం నిర్విషీకరణం అవుతుంది. అంతేకాకుండా తీవ్ర అనారోగ్య సమస్యల కూడా దూరమవుతాయి.
- ఉదయాన్నే నానబెట్టిన డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల శరీరంలో పోషకాల లోపం తగ్గుతుంది. అంతేకాకుండా శరీరంలో కొలెస్ట్రాల్ పరిమాణాలు కూడా తగ్గుతాయి. దీంతో శరీర బరువు నియంత్రణలో ఉంటుంది. అంతేకాకుండా బెల్లీ ఫ్యాట్ కూడా తగ్గుతుందని నిపుణులు అంటున్నారు.
- బరువు తగ్గాలనుకునేవారు ఉదయం పూట ధ్యానం చేయడం కూడా శరీరానికి చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. ప్రతి రోజూ ధ్యానం చేయడం వల్ల మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. దీని కారణంగా బరువు కూడా తగ్గుతారు.
(నోట్: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
Also Read: IND vs AUS 4th Test: కేఎస్ భరత్‌పై విరాట్ కోహ్లీ సీరియస్.. సింగిల్ కోసం పిలిచి..
Also Read: Krithi Shetty Photos: అందాల ఆరబోతలో హద్దులు దాటేస్తున్న కృతి శెట్టి..బాడీకాన్ డ్రెస్సులో థైస్ షో!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook