5 Zodiac Signs in big Troubles due to Guru Asta 2023: వేద జ్యోతిషశాస్త్రంలో.. అదృష్టం, వివాహం మరియు సంతోషానికి కారకంగా బృహస్పతి గ్రహంను పరిగణిస్తారు. 12 సంవత్సరాల తరువాత దేవగురువు బృహస్పతి తన స్వంత రాశి అయిన మీన రాశిలో ఉన్నాడు. బృహస్పతి ఏప్రిల్ 22 వరకు మీన రాశిలో ఉండి.. ఆ తర్వాత మేష రాశిలోకి ప్రవేశిస్తాడు. బృహస్పతి ప్రతి రాశిలో ఒక సంవత్సరం పాటు ఉంటాడు. బృహస్పతి గ్రహం 2024లో తన రాశి చక్రాన్ని మార్చుతుంది. అయితే బృహస్పతి 2023 మార్చి 31న మీన రాశిలో అస్తమించి.. ఏప్రిల్ 30న ఉదయిస్తాడు. ఈ ఒక నెల సమయం కొన్ని రాశుల వారికి చాలా కష్టంగా ఉంటుంది. ఆ రాశులు ఏవో ఇప్పుడు చూద్దాం.
కన్యా:
గురు గ్రహ అస్తవ్యస్తం కన్యా రాశి వారికి చాలా హాని కలిగిస్తుంది. వైవాహిక జీవితంలో సమస్యలు రావచ్చు. మీ జీవిత భాగస్వామితో జాగ్రత్తగా మాట్లాడండి. అన్ని సమస్యలు మిమ్మల్ని చుట్టుముడతాయి. ఈ సమయంలో మీ మాటలను ఇతరుల ముందు బాగా వాడండి .
మిథున రాశి:
మిథున రాశి వ్యక్తుల పనిపై గురు గ్రహ ప్రభావం చెడుగా ఉంటుంది. ముఖ్యంగా వ్యాపారస్తులు జాగ్రత్తగా ఉండాలి. ప్రతి పనిలో ఆటంకాలు ఉండవచ్చు. వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఉండవచ్చు. చర్చ, గొడవలకు పోకపోవడమే మంచిది.
ధనుస్సు:
ధనుస్సు రాశి వారికి గురు గ్రహం అస్తమించడం వల్ల అనారోగ్య సమస్యలు రావచ్చు. కాబట్టి మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. తల్లి ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించండి. రిలేషన్ షిప్ కు కూడా ఇది సరైన సమయం కాదు. ప్రేమకు దూరంగా ఉండండి.
మీనం:
మీన రాశిలోనే బృహస్పతి అస్తమించడం వల్ల ఈ రాశి వారిపై మంచి ప్రభావం ఉండదు. కెరీర్‌లో సమస్యలు రావచ్చు. పని భారం అలాగే ఉంటుంది. ఆర్థిక పరిస్థితి కూడా బాగా ఉండదు. డబ్బుకు సంబంధించి ఎటువంటి ముఖ్యమైన నిర్ణయాలను తీసుకోకండి. ఆచితూచి వ్యవహరించండి.
కుంభం:
గురు గ్రహం అస్తమించడం వల్ల కుంభ రాశి వారి మాటల్లో వేగం కనిపిస్తుంది. మాట్లాడే విషయంలో సంయమనం పాటించడం మంచిది. అతి విశ్వాసంకు పోరాదు. పెట్టుబడి అసలు పెట్టవద్దు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి