Traffic Testrictions in Hyderabad on Ram Navami Shobha Yatra 2023: భారతీయ సంస్కృతి, సంప్రదాయం, దర్మం మరియు విలువలకు ప్రతిరూపం 'శ్రీరాముడు' అని పురాణాల్లో చెప్పబడింది. అందుకే శ్రీరాముడిని కీర్తిస్తూ.. భక్తజనం ప్రతి ఏటా పండుగ జరుపుకొంటారు. ఈ ఏడాది మార్చి 30న చైత్రమాసం శుక్లపక్షం నవమి గురువారం శ్రీరామనవమి. శ్రీ మహా విష్ణువు త్రేతాయుగంలో ధర్మస్థాపన కోసం శ్రీరాముడిగా అవతరించిన దినమే.. చైత్ర శుక్లపక్ష నవమి శ్రీరామ నవమి. ఈ రోజున ప్రధానంగా మూడు ఘట్టాలు (శ్రీరామ జననం, సీతారాముల కల్యాణం, శ్రీరామ పట్టాభిషేకం) నిర్వహిస్తారన్న విషయం తెలిసిందే. దాంతో రేపు దేశవ్యాప్తంగా పండగ జరగనుంది.
శ్రీరామనవమి రోజున భక్తజనం చాలా చోట్ల శ్రీరామనవమి శోభాయాత్ర (Sri Rama Shobha Yatra)ను నిర్వహిస్తారు. గురువారం నాడు హైదరాబాద్‌లో కూడా శ్రీరామనవమి శోభాయాత్ర జరగనుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు నగర పోలీసులు. గురువారం (మార్చి 30) ఉదయం 11 నుంచి రాత్రి 10 గంటల వరకు హైదరాబాద్‌లోని పలు మార్గాల్లో దారి మళ్లింపులు, మూసివేతలు ఉంటాయని పొలీసు అధికారులు తెలిపారు. ముఖ్యంగా గోషామహల్, సల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఆంక్షలు ఉంటాయి. శోభాయాత్ర మొత్తంగా 6 కిలోమీటర్ల మేర ఉండనుంది.
గురువారం ఉదయం 11 గంటలకు సీతారాంబాగ్ ఆలయం వద్ద శ్రీరామనవమి శోభాయాత్ర ప్రారంభం అవుతుంది. బోయగూడ కమాన్, మంగళ్‌హాట్ పోలీస్‌స్టేషన్ రోడ్డు, జాలి హనుమాన్, దూల్‌పేట, పురానాపూల్, జుమేరాత్ బజార్, చుడిబజార్, బేగంబజార్ చత్రి, బర్తన్ బజార్, సిద్దంబర్ బజార్ మసీదు, శంకర్ షేర్ హోటల్, గౌలిగూడ కమాన్, గురుద్వారా, పుత్లిబౌలి బౌరస్తా, కోఠి ఆంధ్రా బ్యాంక్ మీదుగా సుల్తాన్ బజార్‌లోని హనుమాన్ వ్యాయామశాలకు యాత్ర చేరుకుంటుంది.
శ్రీరామనవమి శోభాయాత్ర నేపథ్యంలో యాత్ర సాగనున్న పై మార్గాల్లో వాహనాల దారి మళ్లింపు ఉంటుందని హైదరాబాద్ నగర ట్రాఫిక్ పోలీసు అధికారులు వెల్లడించారు. గురువారం నాడు వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచించారు. మరోవైపు శోభాయాత్ర సందర్భంగా హైదరాబాద్ పోలీసులు భారీ బందోబస్త్ ఏర్పాటు చేశారు. ఎలాంటి గొడవలు జరగకుండా.. శోభాయాత్ర జరిగే ప్రాంతాలలో పోలీసులు ఉండనున్నారు. అంతేకాదు నగరం అంతటా రేపు పోలీసులు తిరగనున్నారు.
Also Read: జియో బెస్ట్ రీఛార్జ్ ప్లాన్స్.. హాట్ సమ్మర్లో కూల్‌గా ఐపీఎల్ 2023ని ఆస్వాదించండి! డేటా ఖతం కాదు
Also Read: Rohit Sharma: ముంబై ఇండియన్స్‌కు భారీ షాక్.. రోహిత్ శర్మ ఔట్! కెప్టెన్‌గా సూర్యకుమార్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.