Effect Of COVID-19 Vaccine: కరోనా టీకాల ప్రభావం.. అధ్యయనాలు ఏం చెబుతున్నాయంటే!

 దేశ వ్యాప్తంగా కోవాగ్జిన్, కోవిషీల్డ్ తొలి దశ టీకాలు ఇస్తున్నారు. స్థూలకాయం(Obesity), కొన్ని రకాల ఆరోగ్య కారణాలు ఉన్న వారికి కోవిడ్ -19 వ్యాక్సిన్లు సామర్థ్యం మేర పనిచేయవని నివేదికలు చెబుతున్నాయి.

COVID-19 Vaccine Effect: దేశ వ్యాప్తంగా కోవాగ్జిన్, కోవిషీల్డ్ తొలి దశ టీకాలు ఇస్తున్నారు. స్థూలకాయం(Obesity), కొన్ని రకాల ఆరోగ్య కారణాలు ఉన్న వారికి కోవిడ్ -19 వ్యాక్సిన్లు సామర్థ్యం మేర పనిచేయవని నివేదికలు చెబుతున్నాయి.

1 /5

COVID-19 Vaccine: దేశ వ్యాప్తంగా కోవాగ్జిన్(Covaxin), కోవిషీల్డ్ తొలి దశ టీకాలు ఇస్తున్నారు. స్థూలకాయం, కొన్ని రకాల ఆరోగ్య కారణాలు ఉన్న వారికి కోవిడ్ -19 వ్యాక్సిన్లు సామర్థ్యం మేర పనిచేయవని నివేదికలు చెబుతున్నాయి. Also Read: COVID-19 Vaccine: కరోనా టీకా తీసుకున్నా.. వీరికి అంతగా పనిచేయదు!

2 /5

ఊబకాయం ఉన్నవారికి కరోనా వచ్చే అవకాశం ఎక్కువని పలు అధ్యయనాలు గుర్తించాయి. ఆగష్టు 2020లో అన్నల్స్ ఆఫ్ ఇంటర్నల్ మెడిసిన్‌లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం.. అధిక బరువు ఉన్న వారికి COVID-19 సంక్రమించే అవకాశం అధికంగా ఉంది. ముఖ్యంగా యువకులు, మధ్య వయసు మగవారిలో ఇది మరింత ప్రమాదమని చెబుతున్నారు.

3 /5

ఊబకాయం(Obesity) ఉన్నవారితో పాటు మద్యం సేవించే వారిలో కరోనా టీకాలు తీసుకున్నప్పటికీ దాని సామర్థ్యం మేరకు వ్యాక్సిన్ ప్రభావం చూపదని పలు అధ్యయనాలు వెల్లడించాయి. నిరాశ, ఒత్తిడి, ఒంటరితనం లాంటి అంశాలు శరీర రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తాయని తద్వారా కోవిడ్-19 వ్యాక్సిన్ యొక్క సామర్థ్యాన్ని దెబ్బతీస్తాయని చెప్పారు.  Also Read: COVID-19 Vaccine: కరోనా వ్యాక్సిన్ తీసుకున్నవారిలో ఏ లక్షణాలు కనిపిస్తాయంటే..

4 /5

కాలేయ వ్యాధి, మూత్రపిండాల వ్యాధి, అధిక మధుమేహం, క్యాన్సర్ వంటి రోగనిరోధక శక్తి లేని పరిస్థితులు ఎదుర్కొంటున్న వారికి కరోనా టీకాలు అంతగా పనిచేయవు. అందుకోసం వీరు చాలా జాగ్రత్తగా ఉండాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

5 /5

కోవిడ్ -19 టీకా తీసుకోవడానికి ముందు, టీకా తీసుకున్న తర్వాత సైతం కొన్ని రోజులపాటు మద్యపానానికి దూరంగా ఉండాలని ముత్తా సిఫారసు చేశారు. ఏదైనా టీకా వల్ల గరిష్ట అధిక ప్రయోజనం పొందాలంటే ధూమపానం, మద్యపానానికి దూరంగా ఉండాలని, ఎక్కువ గంటలు నిద్రించాలని నిపుణులు సూచిస్తున్నారు. Also Read: COVID-19 Vaccine: కరోనా వ్యాక్సిన్ తీసుకునే మద్యం ప్రియులకు చేదువార్త..