Hyderabad: రేపు ఓల్డ్‌ సిటీలో మెగా జాబ్‌ ఫెయిర్.. అర్హత వివరాలు తెలుసుకోండి..

‌Mega Job Fair In Old City: నిరుద్యోగులకు శుభవార్త రేపు ఓల్డ్‌ సిటీలో మెగా జాబ్‌ ఫెయిర్‌ నిర్వహించనున్నారు. ఈ జాబ్‌ మేళాకు ఫ్రెషర్స్‌, అనుభవం ఉన్నవారు కూడా అర్హులు ఇతర వివరాలు తెలుసుకుందాం.
 

1 /5

నిరుద్యోగులకు బంపర్‌ ఆఫర్. రేపు శనివారం ( సెప్టెంబర్‌ 14న) ఓల్డ్‌ సిటీ చార్మినార్‌ వద్ద ఉన్న గుల్జర్‌ ఫంక్షన్‌ హాల్‌లో మెగా జాబ్‌ ఫెయిర్‌ నిర్వహిస్తున్నారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు ఈ జాబ్‌ మేళా నిర్వహించనున్నారు.  

2 /5

జానీ మియా అండ్‌ కో ఆధ్వర్యంలో పది పాసైన వారికి ఈ జాబ్‌ మేళాను నిర్వహిస్తున్నారు. ఏ అనుభవం లేకున్నా ఈ జాబ్‌ మేళాకు అర్హులు. అనుభవం ఉన్నవాళ్ల కూడా ఈ జాబ్‌ ఫెయిర్‌ లో పాల్గొనవచ్చు.   

3 /5

ఈ మేగా జాబ్‌ మేళాలో దాదాపు 70 కంపెనీలు పాల్గొంటున్నాయి. జాబ్‌ ఫెయిర్‌లో ఎంపికైన అభ్యర్థులకు స్పాట్‌ అపాయింట్‌మెంట్‌ లెట్టర్ ఇవ్వనున్నారు. 10 కాపీలు రెజ్యూమ్స్‌తో డైరెక్ట్‌గా ఇంటర్వ్యూకు హాజరు కావాలి. ఎంట్రీ ఫీజు కూడా చెల్లిస్తారు.  

4 /5

ఆగష్టు 31న మసాబ్‌ ట్యాంక్ లో మెగా జాబ్‌ ఫెయిర్‌ ఖాజా ఫంక్షన్‌ మాన్షన్‌ హాల్‌లో నిర్వహించారు. ఫార్మా, హెల్త్‌, ఐటీ, ఎడ్యుకేషన్‌, బ్యాంకింగ్‌, వర్క్‌ ఫ్రం హోం జాబులకు జాబ్‌ ఫెయిర్‌ నిర్వహించారు. దీనికి అర్హత పదో తరగతిగా నిర్ణయించి ఇంటర్వ్యూలు కూడా చేశారు.  

5 /5

ఆసక్తి ఉన్న అభ్యర్థులు నేరుగా రెజ్యూమ్‌ తీసుకుని ఇంటర్వ్యూకు హాజరు కావాలి. మరిన్ని వివరాలకు 8374315052 నంబర్‌కు సంప్రదించాలి.