చిరంజీవితో అత్తకు యముడు అమ్మాయికి మొగుడు, దొంగ మొగుడు, జేబుదొంగ, పసివాడి ప్రాణం, రాక్షసుడు లాంటి సూపర్ హిట్ సినిమాలు తీసిన ఎ.కోదండరామిరెడ్డి ఈ చిత్రానికి కూడా దర్శకత్వం వహించడం విశేషం.
పూర్తిస్థాయి సెంటిమెంట్ చిత్రంగా పేరుగాంచిన "విజేత" చిత్రానికి హాస్యబ్రహ్మ జంధ్యాల సంభాషణలు సమకూర్చడం గమనార్హం.
ఈ సినిమాలో భానుప్రియ హీరోయిన్‌గా నటించగా.. చిరంజీవి తండ్రి పాత్రలో జె.వి.సోమయాజులు కనిపిస్తారు.
చిరంజీవి నటించిన టాప్ టెన్ చిత్రాలలో తప్పకుండా చోటు దక్కించుకోదగ్గ చిత్రం "విజేత"
చక్రవర్తి ఈ చిత్రానికి సంగీత దర్శకత్వం వహించగా.. లోక్ సింగ్ ఛాయాగ్రహణం బాధ్యతలు తీసుకున్నారు. శత దినోత్సవం జరుపుకున్న ఈ చిత్రం.. తెలుగులో మరిన్ని కుటుంబ కథాచిత్రాలకు మార్గం సుగమం చేసింది.
ఈ చిత్రంలో కథానాయకుడు ఫుట్ బాల్ క్రీడాకారుడు. కిడ్నీ దానం చేస్తే..జీవితంలో మళ్లీ ఆట ఆడలేడని తెలుసుకున్నా.. కుటుంబం కోసం ఆ త్యాగాన్ని చేస్తాడు. అప్పటికి తెలుగు సినిమాల్లో వచ్చిన ఇతివృత్తాలలో వైవిధ్యమైన కాన్సెప్ట్ అది. అందుకే ఆ సెంటిమెంట్ చిత్రానికి ప్రేక్షకులూ బ్రహ్మరథం పట్టారు.
ఈ చిత్రంలోని "ఎంత ఎదిగిపోయావయ్యా" అనే గీతం చాలా ఆర్ద్రంగా సాగుతుంది. పూర్తిగా జీవితం విలువను తెలిపే ఆ పాట ప్రేక్షకులను కూడా ఆలోచింపజేస్తుంది.
చిరంజీవి కెరీర్‌లో మైలురాయిగా నిలిచిపోయిన చిత్రాలలో అగ్రస్థానంలో నిలిచే చిత్రం "విజేత"
Publish Later:
No
Publish At:
Tuesday, October 23, 2018 - 18:05
Mobile Title:
మెగాస్టార్ చిరంజీవి "విజేత" చిత్రానికి 33 ఏళ్లు
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.