40 years of India’s 1983 World Cup: టీమిండియా క్రికెట్ చరిత్రను మలుపు తిప్పినరోజు.. మన జాతీయ జెండాను ప్రపంచవేదికపై రెపరెపలాడించిన రోజు.. 1983 జూన్ 25న భారత జట్టు సగర్వంగా ప్రపంచకప్‌ను ముద్దాడిన రోజు. ఏ మాత్రం అంచనాలు లేకుండా అండర్‌డాగ్స్‌గా బరిలోకి దిగిన భారత్.. అప్పటి ప్రపంచస్థాయి మేటి జట్లను ఓడించి వరల్డ్ కప్‌తో స్వదేశానికి తిరిగివచ్చింది. ఫైనల్లో రెండుసార్లు ఛాంపియన్ వెస్టిండీస్‌పై విజయం చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోతుంది. కపిల్ దేవ్ నాయకత్వంలోని టీమిండియా వరల్డ్ కప్ గెలుచుకుని నేటితో 40 సంవత్సరాలైంది. ఈ సందర్భంగా 1983 వరల్డ్ కప్ హీరోలను ఓసారి గుర్తు చేసుకుందాం..
1983 World Cup Anniversary: చరిత్రలో మర్చిపోలేని క్షణం.. దేశానికి తొలి ప్రపంచకప్‌ను అందించిన హీరోలు వీళ్లే!