Pranitha Subhash: రెండో బిడ్డకు జన్మనిచ్చిన 'బావ' సిద్ధార్థ్‌ హీరోయిన్‌

Pranitha Subhash Delivery Baby Boy: సినీ పరిశ్రమలో మరో హీరోయిన్‌ తల్లిగా మారింది. తెలుగు సినీ ప్రేక్షకులను తన అందంతో మెప్పించి ప్రస్తుతం దూరమైన ఆ హీరోయిన్‌ పండంటి బాబుకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని తన సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించింది. దీంతో ఆమె అభిమానులు, నెటిజన్లు సామాజిక మాధ్యమాల్లో శుభాకాంక్షలు చెబుతున్నారు.

1 /7

Pranitha Subhash Baby Boy: తెలుగు సినీ ప్రేక్షకులకు సుపరిచితమైన హీరోయిన్‌ ప్రణీత సుభాష్‌ ఆనందంలో మునిగింది.

2 /7

Pranitha Subhash Baby Boy: ఏం పిల్లో ఏం పిల్లడో సినిమాతో తెలుగులో హీరోయిన్‌ అరంగేట్రం చేసిన ప్రణీత. సిద్ధార్థ్‌ నటించిన బావ సినిమాతో గుర్తింపు వచ్చింది. 

3 /7

Pranitha Subhash Baby Boy: అత్తారింటికి దారేది సినిమాలో రెండో హీరోయిన్‌గా ప్రణీత ముద్దుగా కనిపించింది.

4 /7

Pranitha Subhash Baby Boy: హిందీ, కన్నడ, తమిళ్‌ సినిమాల్లో కూడా నటించిన ప్రణీత కొన్నాళ్లకు సినీ పరిశ్రమకు బై బై చెప్పేసి వ్యక్తిగత జీవితంలో బిజీగా మారింది.

5 /7

Pranitha Subhash Baby Boy: వ్యాపారవేత్త నితీన్‌ రాజును 2021లో వివాహం చేసుకున్న ప్రణీత 2022లో పాప అర్నాకు జన్మనిచ్చింది.

6 /7

Pranitha Subhash Baby Boy: ఇప్పుడు రెండోసారి తల్లయ్యింది. పండంటి బాబుకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని ప్రణీత స్వయంగా చెప్పి బాబు, భర్తతో ఉన్న ఫొటోను పంచుకుంది.

7 /7

Pranitha Subhash Baby Boy: 'ఇది నాకు గొప్ప విషయం. నేను, నా కూతురు అర్నా ఇద్దరం సంతోషంగా ఫీలయ్యాం. నా పాప నా పాప అంటూ అర్నా పిలుస్తోంది. కానీ తనకు తెలియదు ఆ పాప తనకే అని' అంటూ ప్రణీత సుభాష్‌ పోస్టు చేసింది.