EPFO Pension: మీరు పీఎఫ్ ఖాతాదారులా? 58 ఏళ్ల వయస్సుకు ముందుగానే పెన్షన్ పొందవచ్చని మీకు తెలుసా?

EPFO Pension: సాధారణంగా ఒక ఉద్యోగి పదేళ్లపాటు ఈపీఎఫ్‌ఓలో కంట్రిబ్యూట్‌ చేస్తే అతను పెన్షన్‌కు అర్హుడు అవుతాడని ఈపీఎఫ్ఓ రుల్స్‌ చెబుతున్నాయి. ఆ పెన్షన్‌ 58 ఏళ్ల నుంచి ప్రారంభమవుతుంది.. కానీ ఈపీఎఫ్‌ఓ కొన్ని నిబంధనల ప్రకారం ఉద్యోగి కుటుంబ సభ్యులు కూడా పెన్షన్‌ పొందవచ్చు. అయితే, ఏడు రకాల పెన్షన్లు అందుబాటులో ఉన్నాయి.  అది ప్రైవేటు రంగంలో పనిచేస్తున్న ఉద్యోగి కూడా ఇది వర్తిస్తుంది.ఈపీఎఫ్‌ఓ ద్వారా 7 రకాల పెన్షన్లు ఉద్యోగులు పొందవచ్చు. ప్రైవేటు సెక్టార్‌లో పనిచేసే ఉద్యోగులకు కూడా ఇది వర్తిస్తుంది. అయితే, ప్రతిఒక్కరూ ఈ ఆప్షన్స్‌ గురించి తెలుసుకోవాలి.
 

1 /7

1. ముందస్తు పెన్షన్‌.. సాధారణంగా ఈపీఎఫ్‌ఓ నిబంధనల ప్రకారం ఉద్యోగి 58 సంవత్సరా నుంచి పెన్షన్‌ పొందడానికి అర్హుడు. అయితే, 50 ఏళ్ల నుంచి కూడా అర్హులైన ఉద్యోగులు పెన్షన్‌ పొందవచ్చు. కానీ ఈ ముందస్తు పెన్షన్‌ ఎంచుకుంటే 4 శాతం ప్రతి ఏడాది తగ్గుతుంది. అంటే ఒకవేళ మీరు రూ.10,000 పెన్షన్‌కు అర్హులు అయితే,58 ఏళ్లకు..మీరు 57 ఏళ్ల నుంచి పెన్షన్‌ పొందాలంటే కేవలం రూ. 9,600 మాత్రమే పొందుతారు. ఒకవేళ 56 ఏళ్లకు పెన్షన్‌ పొందాలంటే రూ. 9,200 పొందుతారు.

2 /7

2. రిటైర్మెంట్‌ పెన్షన్‌.. ఈ రిటైర్మెంట్‌ పెన్షన్‌ 58 ఏళ్లు ఉన్న ఉద్యోగికి అందిస్తారు. ఇది సదరు ఉద్యోగి కంట్రిబ్యూట్‌ చేసిన పీఎఫ్‌ ఆధారంగా నిర్ణయిస్తారు. అయితే, 58, 60 మధ్యలో కూడా పెన్షన్‌ పొందవచ్చు.అప్పుడు పెన్షన్‌ స్కీమ్‌ 4 శాతం పెరుగుతూ వస్తుంది.

3 /7

3. డిసెబిలిటీ పెన్షన్‌.. సర్వీస్‌ సమయంలో డిసెబిలిటీ కింద ఈపెన్షన్‌ అందిస్తారు. ఇందులో 10 ఏళ్లు తప్పనిసరిగా కంట్రిబ్యూట్‌ చేయాల్సిన పనిలలేదు. కనీసం 2 ఏళ్లు కంట్రిబ్యూట్‌ చేసిన పెన్షన్‌కు అర్హులు.

4 /7

4. వితంతు, చైల్డ్‌ పెన్షన్‌.. ఒకవేళ పీఎఫ్ ఖాతాదారుడు మరణిస్తే అతని భార్య, 25 ఏళ్లలోపు ఉన్న ఇద్దరు పిల్లలు కూడ పెన్షన్‌ పొందడానికి అర్హులు. మొదటి పిల్లవానికి 25 ఏళ్లు దాటిన తర్వాత ఒకవేళ  మూడో పిల్లవాడు ఉంటే కూడా పెన్షన్‌ పొందుతారు. ఇందులో కూడా పదేళ్ల కంట్రిబ్యూషన్‌ అవసరం లేదు కనీసం ఒక ఏడాది కంట్రిబ్యూట్‌ చేసిన వర్తిస్తుంది.

5 /7

5. అనాథ పెన్షన్.. ఒకవేళ పెన్షన్‌దారుడితోపాటు అతని భార్య కూడా మరణిస్తే వారి ఇద్దరి పిల్లలకు 25 ఏళ్లు వచ్చేవరకు పెన్షన్‌ పొందడానికి అర్హులు. ఈ స్కీమ్‌లో పిల్లలకు 25 ఏళ్లు వచ్చే వరకు పెన్షన్‌ వస్తుంది.

6 /7

6. నామినీ పెన్షన్‌.. ఇందులో భార్య లేదా భర్త, పిల్లలు లేకపోతే నామినీకి పెన్షన్‌ వస్తుంది. పీఎఫ్‌ ఖాతాదారుడి మరణం తర్వాత నామినీ పెన్షన్‌కు అర్హులు. ఇక్కడ ఇద్దరిని నామినీ చేస్తే పెన్షన్‌ ఇద్దరికి వస్తుంది. లేదా ఒక్కరిని నామినీ చేసిన పెన్షన్‌కు అర్హులు.

7 /7

7. డిపెండెంట్‌ పేరెంట్‌ పెన్షన్‌.. ఈపీఎఫ్‌ఓ సబ్‌స్క్రైబర్‌ మరణిస్తే డిపెండెంట్‌ తండ్రి ఈ పెన్షన్‌కు అర్హుడు. ఒకవేళ తండ్రి కూడా లేకపోతే తల్లికి పెన్షన్‌ పొందే అవకాశం ఉంటుంది. దీనికి ఫారమ్‌ 10D సమర్పించాల్సి ఉంటుంది.