IPL History: ఐపీఎల్ చరిత్రలో అన్ని జట్లు బిడ్ వేసిన ఏకైక ప్లేయర్.. చివరకు బేరం కుదిరి..!

MS Dhoni IPL Price: ఐపీఎల్ మెగా వేలం ముగిసింది. అన్ని జట్లు తమకు కావాల్సిన ప్లేయర్ల కోసం కోట్ల రూపాయలు వెచ్చించాయి. అందరూ ఊహించినట్లే రిషబ్ పంత్ రికార్డుస్థాయి ధరకు అమ్ముడుపోయాడు. రూ.27 కోట్లకు లక్నో సూపర్ జెయింట్స్ పోటీ పడి దక్కించుకుంది. శ్రేయాస్ అయ్యర్‌ను పంజాబ్ రూ.26.75 కోట్లకు కొనుగోలు చేసింది. ఈసారి వేలం క్రికెట్ అభిమానులను అలరించింది. అయితే ఐపీఎల్ చరిత్రలో అన్ని జట్లు బిడ్ వేసిన ఏకైక ప్లేయర్‌గా ఎంఎస్‌ ధోనీకి రికార్డు ఉంది.
 

1 /6

2008లో ఐపీఎల్‌ ప్రారంభమైన విషయం తెలిసిందే. అంతకుముందు 2007లో టీమిండియా తొలి టీ20 వరల్డ్ కప్ గెలవడంతో ఐపీఎల్‌కు మొదలైంది.  

2 /6

ఎనిమిది ఫ్రాంచైజీలతో మొదట సిరీస్‌ను ప్రారంభించారు. లోకల్ ప్రేక్షకులను ఆకట్టునేందుకు స్థానిక ఆటగాళ్లను ఎంచుకునేందుకు ఫ్రాంచైజీలకు బీసీసీఐ అవకాశం ఇచ్చింది.  

3 /6

సచిన్ టెండూల్కర్‌ను ముంబై ఇండియన్స్, సౌరవ్ గంగూలీని కోల్‌కతా నైట్‌రైడర్స్, రాహుల్ ద్రావిడ్‌ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, యువరాజ్‌ సింగ్‌ను పంజాబ్ కింగ్స్‌ సెలెక్ట్ చేసుకున్నాయి.  

4 /6

వీరేంద్ర సెహ్వాగ్‌ను సెలెక్ట్ చేసుకునేందుకు చెన్నై సూపర్ కింగ్స్ ప్రయత్నించగా.. ఢిల్లీ డేర్ డెవిల్స్ టీమ్ తమ ప్లేయర్‌గా తీసుకుంది.  

5 /6

టీ20 టీమ్ కెప్టెన్ ఎంఎస్‌ ధోని వేలంలోకి వచ్చాడు. ధోని కోసం ఏకంగా 8 టీమ్‌లు బిడ్ వేశాయి. అన్ని టీమ్‌లు పోటీ పడడంతో ధోని ధర పెరుగుతూ పోయింది. రూ.7 కోట్లు దాటిన తరువాత కొన్ని జట్లు డ్రాప్ అయ్యాయి.  

6 /6

చివరకు చెన్నై, ముంబై జట్లు మాత్రమే అలానే పోటీ పడ్డాయి. రూ.12 కోట్ల వద్ద చెన్నై, ముంబై టీమ్‌లు బేరం కుదుర్చుకున్నాయి. దీంతో ధోని చెన్నై టీమ్‌కు వెళ్లిపోయాడు.