Amaravati Drone Summit: ఆంధ్రప్రదేశ్‌లో డ్రోన్ల షో అదిరే రీతిలో జరిగింది. డ్రోన్లతో వివిధ ఆకృతులు ఆహుతులను ఆకట్టుకున్నాయి. సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి రామ్మోహన్ హాజరై అమరావతి డ్రోన్ సమ్మిట్‌ను వీక్షించారు. కళ్లు చెదిరేలా ఉన్న డ్రోన్ల విన్యాసాలు అదుర్స్ అనిపించాయి.
డ్రోన్ల టెక్నాలజీని వినియోగిస్తున్న చంద్రబాబు ప్రభుత్వం తాజాగా డ్రోన్ల షో నిర్వహించింది.
పౌర విమాన యాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు ఆధ్వర్యంలో జరిగిన డ్రోన్ షోకు పెద్ద ఎత్తున ప్రజలు హాజరయ్యారు.
విజయవాడలోని పున్నమి ఘాట్‌లో వేలాది డ్రోన్లతో విన్యాసాలు చేయించారు. గతంలో ఎప్పుడూ లేని షో కావడంతో ప్రజలు ఆసక్తిగా తిలకించారు.
డ్రోన్ల షో సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ప్రదర్శనలకు చంద్రబాబు పాదాలు కదుపుతూ.. నవ్వుతూ ఉత్సాహంగా కనిపించారు.
డ్రోన్ల షోలో అమరావతి రాజధానికి ప్రతీకగా ఉన్న గౌతమ బుద్ధుడి విగ్రహ రూపం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
జాతీయ జెండా, విమానం, భారత తపాలా సేవలు, డ్రోన్ల టెక్నాలజీ విశేషాలను తెలిపేలా డ్రోన్ల రూపాలు ఉన్నాయి.
ప్రపంచంలోనే భారతదేశం టెక్నాలజీ అడ్డా అని తెలిపేలా ఓ రూపం ఆకట్టుకుంది.
అతిపెద్ద డ్రోన్ షో కావడంతో అమరావతి డ్రోన్ సమ్మిట్‌కు గిన్నీస్ బుక్ రికార్డ్స్‌లో చోటు దక్కింది.
భవిష్యత్తులో డ్రోన్లు గేమ్ ఛేంజర్లుగా చెప్పొచ్చని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. త్వరలోనే రాష్ట్రంలో డ్రోన్ల పాలసీని తీసుకొస్తామని అంతకుముందు జరిగిన సభలో ప్రకటించారు.
డ్రోన్ల సిటీగా అమరావతిని తీర్చిదిద్దుతామని సీఎం చంద్రబాబు తెలిపారు. డ్రోన్లను ఉపయోగించి ఏపీని అభివృద్ధిలో ముంచుతానని చెప్పారు.