Boda kakarakaya: వర్షాకాలంలో ఎక్కువగా బోడకాకర ను తినాలంటారు.. దీని వెనుక ఉన్న రహస్యం ఏంటంటే..?

Boda kakarakaya benefits: వర్షాకాలంలో మాత్రమే బోడకాకర కాయలు లేదా అడవి కాకర కాయలు అరుదుగా లభిస్తుంటాయి. ఇవి ఎంతో టెస్టీగాను, కాస్లీగాను ఉంటాయి. వీటివల్ల పుష్కలమైన ఆరోగ్య లాభాలు కల్గుతాయి.
 

1 /6

చాలా మంది మాములు కాకర కాయలను తినడానికి నానా తంటాలు పడుతుంటారు. కానీ వానకాలంలో దొరికే బోడకాకర కాయల కోసం కొంత మంది ఎదురు చూస్తుంటారు. దీన్ని వివిధ ప్రాంతాలలో అనేక పేర్లతో పిలుస్తుంటారు. కొందరు ఆ కాకర కాయ, అగాకర అని పేర్లతో కూడా పిలుస్తుంటారు.

2 /6

బోడకాకరకాయలు చాలా అరుదుగా లభిస్తాయి.  వీటిలో పుష్కలమైన ఆరోగ్యానికి మేలు చేసే గుణాలు ఉంటాయి. ఇవి మనిషిలోని ఇమ్యునిటీని పెంచుతాయి.  అదే విధంగా పోషకాలు, కొవ్వులు, మినరల్స్ లను అందిస్తాయి. ఇవి తింటే జీర్ణవ్యవస్థ ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.

3 /6

ఇవి తినడం వల్ల మనశరీరానికి విటమిన్లు, మినరల్స్ అందుతాయి.  ఇందులో విటమిన్ బి12, విటమిన్ డి, కాల్షియం, జింక్, కాపర్, మెగ్నీషియం వంటి అన్ని పోషకాలు ఉంటాయి. ఇది శరీరంలో ఇమ్యూనిటీ పవర్‌ను మెరుగు పరుస్తుంది.  

4 /6

కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్, ఫైబర్, విటమిన్ B1, B2, B3, B5, B6, B9, B12, విటమిన్ బి, విటమిన్ సీ, డీలు, విటమిన్ D2, 3, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, సోడియం, కాపర్, జింక్ ఇలా అన్ని ఈ కూరగాయాలో పుష్కలంగా ఉంటాయి. 

5 /6

చాలా మంది తలనొప్పి, వెంట్రుకలు తెల్లబడటం, అజీర్తి వంటి సమస్యలతో బాధపడుతుంటారు. మహిళల్లో పీరియడ్స్ సమస్యలు, డయాబెటిక్, రక్తపోటు, ప్రెగ్నెంట్ లేడీస్ కు బోడకాకర ఎంతో ఉపయోగపడుతుంది.

6 /6

 రక్తంలోని చక్కెర నిల్వలను తగ్గించడంలో బోడకాకర ఉపయోగపడుతుంది.  వర్షాకాలంలో వర్చే వ్యాధులు,  దురదల నుంచి కూడా కాపాడుతుంది. కిడ్నీల్లో రాళ్లకు చెక్ పెడుతుంది. అధిక చెమటను తగ్గిస్తుంది. అదే విధంగా..జీర్ణక్రియను కూడా మెరుగుపరుస్తుందని నిపుణులు చెబుతుంటారు.(Disclimer: పైన పేర్కొన్న అంశాలు కేవలం సోషల్ మీడియా వైరల్ కంటెంట్ ఆధారంగా ప్రస్తావించారు. వాటినే మేము అందిస్తున్నాము. దీన్ని Zee Mediaధృవీకరించలేదు.)