Pudina Health Benefits: పుదీనా ఔషధ ఖజానా.. ఇలా తీసుకుంటే కీళ్లనొప్పులు, కడుపునొప్పి మాయం..

Pudina Health Benefits: సాధారణంగా మన ఇళ్లలో పుదీనా ఉంటుంది. దీంతో రుచికరమైన పచ్చళ్ళు తయారు చేసుకుంటారు. ముఖ్యంగా నాన్ వెజ్ వంటకాల్లో ఉపయోగిస్తారు. అయితే, పుదీనాలో ఔషధ గుణాలు కూడా పుష్కలంగా ఉంటాయి.

1 /5

సాధారణంగా మన ఇళ్లలో పుదీనా ఉంటుంది. దీంతో రుచికరమైన పచ్చళ్ళు తయారు చేసుకుంటారు. ముఖ్యంగా నాన్ వెజ్ వంటకాల్లో ఉపయోగిస్తారు. అయితే, పుదీనాలో ఔషధ గుణాలు కూడా పుష్కలంగా ఉంటాయి. పుదీనాతో జీర్ణ క్రియ కూడా మెరుగు పడుతుంది. సాధారణంగా పాలు త్వరగా విరిగిపోకుండా ఉండటానికి కూడా ఒక చిన్న పుదీనాఆకును పాలలో వేస్తాం. కానీ ఇందులో అత్యుత్తమమైన ఔషధ గుణాలు ఉన్నాయి.  

2 /5

100 గ్రాముల పుదీనాలో 8.5 పిండి పదార్థాలు ఉంటాయి. అంతేకాదు ఇందులో క్యాల్షియం కూడా పుష్కలంగా ఉంటుంది. విటమిన్ ఇ, బీ కూడా పుష్కలంగా ఉంటుంది.పుదీనాను మన డైట్ లో చేర్చుకోవడం వల్ల కడుపునొప్పి, అజీర్తి, కడుపులో పురుగుల సమస్య తొలగిపోతుంది.రెండు స్పూన్ల పుదీనా జ్యూస్ లో ఒక స్పూన్ నిమ్మరసం తేనె కలిపి తాగితే కడుపునొప్పి కడుపు ఉబ్బరం సమస్యలు వెంటనే తగ్గిపోతాయి.  

3 /5

ఈ రుచికరమైన జ్యూస్ ని రోజుకు మూడుసార్లు తాగితే వెంటనే ఫలితాలు కనిపిస్తాయి.చిన్నపిల్లల్లో నులిపురుగుల సమస్య కూడా తగ్గిపోతుంది.చాలామందికి నెలసరి మిస్ అవుతుంది లేదా నెలసరి ఆలస్యం అవుతుంది. ఇలాంటి వారికి పుదీనా అద్భుతంగా పనిచేస్తుంది. అంతేకాదు కొంతమందికి పీరియడ్స్ పెయిన్స్ ఎక్కువగా ఉంటాయి. ఇలాంటి వారికి కూడా పుదీనా ఎంతో మంచిది మంచి ఉపశమనాన్ని ఇస్తుంది. పుదీనా ఆకులను తీసుకొచ్చి కడిగి ఎండబెట్టండి. దీన్ని పొడి చేసుకొని నీళ్లు పోసి అర గ్లాసు అయ్యేవరకు బాగా మరిగించుకోవాలి.

4 /5

దీని తీసుకోవడంల వల్ల పీరియడ్స్ లో పెయిన్ సమస్య తగ్గిపోతుంది.నెలసరి కూడా సక్రమంగా వస్తుంది కడుపునొప్పి క్రమంగా తగ్గిపోతుంది. దగ్గు జలుబు గొంతు నొప్పి వంటి రెస్పిరేటరీ సమస్యలకు పుదీనా అద్భుతంగా పనిచేస్తుంది. పుదీనాతో కషాయం తయారు చేసుకొని తాగితే మంచి ఉపశమనం లభిస్తుంది  

5 /5

తలనొప్పి ఉండే వారికి కూడా పుదీనా బెస్ట్ ఆప్షన్. తలనొప్పితో బాధపడేవారు పుదీనా అని నలిపి వాసన చూస్తే తల తిరగడం సమస్య తగ్గిపోతుంది.కాదుమంతు మంచి మౌత్ ఫ్రెషనర్ గా కూడా పుదీనా పనిచేస్తుంది