Lip Care Tips: గులాబీ రేకులు వంటి పెదవుల కోసం ఈ చిట్కాలు!

Lip Care Home Remedies: పెదాల పొడిబారడం, నల్లబడటం, లిప్ పిగ్మెంటేషన్ వంటి సమస్యలు చాలా మందిని వేధిస్తున్నాయి. ఈ సమస్యలకు కారణాలు ఎన్నో ఉంటాయి. అయితే ఈ సమస్య నుంచి ఉపశమనం పొందాలి అనుకొనేవారు ఈ ఇంట్టి చిట్కాలను పాటిస్తే సరిపోతుంది. 
 

Lip Care Home Remedies: వర్షాకాలంలో చాలా మంది పెదాలు నల్లగా, పొడిబారడం, పిగ్మెంటేషన్‌ సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. ఆరోగ్య నిపుణులు ప్రకారం కెఫిన్ ఎక్కువగా ఉండే ఆహారపదార్థాలు తీసుకోవడం, కెమికల్స్‌ ఉన్న లిప్‌ ప్రొడెక్ట్స్‌ను ఉపయోగించడం వల్ల పెదాలు అందవిహీనంగా కనిపిస్తాయి. కొందమందిలో డీహైడ్రేషన్‌ సమస్య కారణంగా పెదాలు పొడిబారుతాయి. అయితే ఈ సమస్య నుంచి సహాజంగా బయటపడవచ్చని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. దీని కోసం మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. 
 

1 /7

శరీరంలో నీరు తక్కువగా ఉంటే పెదాలు పొడిబారే అవకాశం ఎక్కువ. రోజూ తగినంత నీరు తాగడం చాలా ముఖ్యం.  

2 /7

లిప్ బామ్ పెదాలకు తేమను అందిస్తుంది. ముఖ్యంగా వాతావరణం చల్లగా లేదా ఎండగా ఉన్నప్పుడు, నిద్రించే ముందు ఆహారం తీసుకున్న తర్వాత లిప్ బామ్ వాడండి.  

3 /7

కొన్ని లిప్‌స్టిక్‌లు లేదా లిప్‌లైనర్‌లు పెదాలను పొడిబారేలా చేస్తాయి. అలాంటి ఉత్పత్తులను ఉపయోగించడం మానుకోండి.  

4 /7

పండ్లు, కూరగాయలు, గింజలు, విత్తనాలు వంటి ఆరోగకరమైన ఆహారాలు తీసుకోవడం వల్ల శరీరంలో తేమ స్థాయిలు పెరుగుతాయి.  

5 /7

 చలిగా లేదా ఎండగా ఉన్నప్పుడు స్కార్ఫ్ లేదా మాస్క్ ధరించడం ద్వారా పెదాలను వాతావరణం నుంచి రక్షించుకోవచ్చు.  

6 /7

వేడి నీరు పెదాలను పొడిబారేలా చేస్తుంది. గోరువెచ్చని నీటితో స్నానం చేయడం మంచిది.  

7 /7

పైన చెప్పిన చిట్కాలు పాటిస్తున్నా పెదాలు పొడిబారడం ఆగకపోతే వైద్యుడిని సంప్రదించండి.