Ananya Nagalla Yoga: యోగా చేస్తూ.. వయ్యరాలు ఒలకబోసిన అనన్య నాగళ్ల!

Ananya Nagalla Yoga Images goes viral. ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా యంగ్ బ్యూటీ అనన్య నాగళ్ల యోగా చేశారు. యోగాసనాలు చేసిన ఫోటోలు షేర్ చేసి కుర్రకారుకు కునుకు లేకుండా చేస్తున్నారు. 
 

1 /6

మోడ్రన్‌, వెస్ట్రన్ డ్రెస్‌లతో పాటుగా హాఫ్ శారీ, శారీలతో ఎప్పటికప్పుడు అదిరిపోయే స్టిల్స్‌తో అనన్య నాగళ్ల ఫోటో షూట్‌లు చేస్తారు. వాటిని తన ట్విట్టర్, ఇన్‌స్టా హ్యాండిల్‌లో షేర్ చేసి అభిమానులను అలరిస్తుంటారు.  

2 /6

ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో నిలదొక్కుకుంటున్న అనన్య నాగళ్లకు సోషల్ మీడియాలో మాత్రం భారీ ఫ్యాన్‌ ఫాలోయింగ్ ఉంది. అమ్మడు ఏ ఫోటో షేర్ చేసిన లక్షల్లో వ్యూస్, వేలల్లో లైక్‌లు వస్తాయి.   

3 /6

వకీల్ సాబ్ అనంతరం నితిన్ నటించిన మాస్ట్రో సినిమాలో నటించారు అనన్య. ఈ సినిమాలో ఆమె కీలక పాత్రలో నటించి అందరిని ఆకట్టుకున్నారు.   

4 /6

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కమ్ బ్యాక్ మూవీ 'వకీల్ సాబ్' సినిమాతో అనన్య నాగళ్ల పాపులర్ అయ్యారు. ఆ సినిమాలో అనన్య నటనకు అందరూ ఫిదా అయ్యారు.  

5 /6

మల్లేశం సినిమా అనంతరం తెలుగందం అనన్య నాగళ్ల 'ప్లే బ్యాక్' టైటిల్‌తో తెరకెక్కిన ఓ స్మాల్ బడ్జెట్ మూవీ చేశారు. అయితే ఆ సినిమా ఆమెకు పెద్దగా కలిసిరాలేదు.  

6 /6

తెలంగాణ చేనేత కార్మికుడు చింతకింది మల్లేశం జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన 'మల్లేశం' సినిమాతో అనన్య నాగళ్ల తెలుగు ఇండస్ట్రీలోకి  ఎంట్రీ ఇచ్చారు. ప్రియదర్శి భార్యగా నటించిన ఆమెకు మంచి మార్కులే పడ్డాయి.