AP Liquor Policy: ఆంధ్ర ప్రదేశ్ లో లాటరీ ద్వారా మద్యం షాపుల కేటాయింపు చేస్తున్నారు అధికారులు. ఉదయం నుంచే లాటరీ ప్రక్రియ ప్రారంభం అయింది. కలెక్టర్లు, ఎక్సైజ్ అధికారులు ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ నిర్వహిస్తున్నారు.
ఏపీలో మద్యం షాపులకు మొత్తం 89వేల 882 దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తుల ఫీజులతో ప్రభుత్వానికి 1వేయి 797 కోట్ల ఆదాయం వచ్చింది.
ఎన్టీఆర్ జిల్లాలో 113 షాపులకు అత్యధికంగా 5వేల 825 దరఖాస్తులు వచ్చాయి. అనంతపురం జిల్లాలో 12 షాపులకు అతి తక్కువగా దరఖాస్తు చేసుకున్నారు.
లాటరీ ద్వారా ఎన్నుకున్న వారికి మంగళవారం లిక్కర్ షాపులను అప్పగించనున్నారు. ఈ నెల 16 నుంచి రాష్ట్రంలో కొత్త మద్యం పాలసీ అమలు కానుంది.
మొత్తంగా ఎన్నికల సమయంలో ఇచ్చిన మరో హామిని ఆంధ్ర ప్రదేశ్ లో అధికారంలోకి వచ్చిన తెలుగు దేశం, బీజేపీ, జనసేన కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుంది. మద్యం విధానం పూర్తిగా మార్చేసి తక్కువ ధరకే మందును అందుబాటులోకి తీసుకురాబోతుంది.
ఏపీ కొత్త మద్యం విధానంలో లిక్కర్ ధరలను కూడా భారీగా తగ్గించి అతి తక్కువకే మద్యం అందించడానికి ప్రభుత్వం రంగం సిద్ధం చేసుకుంది. ఈ సందర్భంగా మద్యం ధరలు ఖరారు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే కదా. మద్యం ధరల సవరణపై గెజిట్ విడుదల చేసింది.