Anil Ambani House: బాబోయ్.. ఇది ఇల్లు కాదు.. అద్భుతమైన ప్యాలెస్.. అనిల్ అంబానీ ఇంటి లేటెస్ట్ పిక్స్ చూశారా..!

Anil Ambani House Inside Pics: ముఖేష్ అంబానీ సోదరుడు, ఒకప్పుడు ప్రపంచంలోనే ఆరో అత్యంత సంపన్న వ్యాపారవేత్త అయిన అనిల్ అంబానీ ప్రస్తుతం భారీగా అప్పుల్లో కురుకుపోయారు. గతంలో తన అన్న కంటే ఎక్కువ సంపద కలిగిన అనిల్ అంబానీ.. వ్యాపారాల్లో నష్టాలు రావడంతో క్రమంలో అప్పులపాలయ్యారు. బ్యాంకుల వద్ద తీసుకున్న అప్పులు తీసుకుని చెల్లించలేకపోయారు. వేల కోట్ల ఆస్తులు.. వందల కోట్లకు చేరాయి. రీసెంట్‌గా అనంత్ అంబానీ ప్రీవెడ్డింగ్ వేడుకలో సాధారణ వ్యక్తిగా కనిపించారు. విలాసవంతమైన ఆయన ఇంటిపై ఓ లుక్కేయండి.
 

1 /9

ముంబైలోని పాలి హిల్ ప్రాంతంలో అనిల్ అంబానీ నివసిస్తున్నారు. ఆయన ఇల్లు 16 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. మొత్తం 17 అంతస్తుల్లో నిర్మించారు.  

2 /9

అత్యాధునిక వసతులతో ఇంటిని నిర్మించారు. హెలిప్యాడ్, జిమ్, స్విమ్మింగ్ పూల్, గ్యారేజ్ వంటి సౌకర్యాలు ఉన్నాయి.   

3 /9

ఈ ఇంట్లో విలాసవంతమైన రూములు ఉన్నాయి. అనిల్ అంబానీ ఫ్యామిలీ మాత్రమే ఇక్కడ నివసిస్తోంది.  

4 /9

ఈ ఇల్లు అద్భుతమైన ప్యాలెస్ మాదిరి ఉంటుంది. ఇంటీరియర్ డెకరేషన్ కోసం చాలా ఖర్చు చేశారు.   

5 /9

ఇంట్లో ఎంటర్ అవ్వగానే.. ఇంటీరియర్ డిజైన్ మెస్మరైజ్ చేస్తుంది. ఇంటిని విదేశీ ఇంటీరియర్ డిజైనర్లతో అలకరించారు.  

6 /9

ఫర్నీచర్ కూడా అద్భుతంగా ఉంటుంది. ఇంటర్‌నేషనల్ బ్రాండ్స్‌ను ఉపయోగించారు.  

7 /9

అనిల్ అంబానీ, అతని భార్యకు పురాతన డిజైన్లు అంటే ఇష్టం. ఇంటీరియర్ డెకరేషన్ పురాతన శైలిలో ఉంటుంది.   

8 /9

ఇంటి అలంకరణకు డిఫరెంట్ కలర్స్ ఉపయోగించారు. ఇంటి వేర్వేరు గదులు వేర్వేరు డిజైన్లు, డిఫరెంట్ కలర్స్‌తో ఉంటాయి.   

9 /9

ఈ ఇంటి విలువ రూ.5 వేల కోట్లు ఉంటుందని అంచనా. నిర్వహణకు కూడా భారీగానే ఖర్చు అవుతోందట.