Ap New liquor policy: ఆంధ్ర ప్రదేశ్ లో ఇటీవల చంద్రబాబు సర్కారు కొత్త మద్యం పాలసీని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. దీంతో ప్రస్తుతం ఏపీలో మద్యం ప్రియులు మాత్రం పండగ చేసుకుంటున్నట్లు తెలుస్తొంది.
ఆంధ్ర ప్రదేశ్ లో ఇటీవల అసెంబ్లీ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. దీనిలో టీడీపీ, జనసేన కూటమి భారీ మెజార్టీతో విజయం సాధించింది. ఈ నేపథ్యంలో కూటమి సర్కారు ఎన్నికల్లో వినూత్నంగా ప్రచారం చేసింది.
తమ కూటమి సర్కారు ఏర్పడితే... ఏపీలో తక్కువ ధరకే నాణ్యమైన మద్యంను అందుబాటులోకి తీసుకొస్తామని కూడా ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఇటీవల ఏపీలో కూటమి సర్కారు ఏర్పడింది. అంతే కాకుండా.. లిక్కర్ విషయంలో కూటమి అనేక మార్పులు సైతం తీసుకొచ్చింది.
ఇటీవల ఏపీలో కొత్త మద్యం పాలసీని సైతం తీసుకొచ్చారు. దీనికి ఎక్కడ కూడా పొలిటికల్ నాయకుల జోక్యం ఉండని విధంగా కూటమి సర్కారు చర్యలు తీసుకుంది. అదే విధంగా లిక్కర్ అంశంలో జోక్యం చేసుకొవద్దని రాజకీయ నాయకులకు చంద్రబాబు సర్కారు వార్నింగ్ కూడా ఇచ్చారు.
ఈ క్రమంలో ఏపీ వ్యాప్తంగా కలెక్టర్ ఆ ఆధ్వర్యంలో.. లిక్కర్ షాపుల డ్రాను ఎక్కడ కూడా అనుమానాలకు తావు లేకుండా.. ట్రాన్సరెన్సీగా నిర్వహించారు. అయితే.. ఏపీలో లిక్కర్ పాలసీతో ప్రభుత్వానికి భారీగా ఆదాయం కూడా సమకూరిందని తెలుస్తొంది.
అయితే.. తాజాగా, ఏపీలో లిక్కర్ పాలసీ తర్వాత తరచుగా ఏదో ఘటనలో లిక్కర్ షాపులు వార్తలలో ఉంటున్నాయి. ఆంధ్ర ప్రదేశ్ లో లిక్కర్ షాపుల విషయంలో పోటీ నెలకొందని తెలుస్తొంది.. దీంతో కస్టమర్లను ఆకర్శించేందుకు కొన్ని లిక్కర్ షాపుల వాళ్లు వెరైటీగా ఫ్లెక్సీలను సైతం ఏర్పాటు చేశారు.
అన్నమయ్య జిల్లా రాజంపేటలో..ఒక లిక్కర్ షాపు ఓనర్ వినూత్నంగా ఫ్లెక్సీని ఏర్పాటు చేశాడు. అంతే కాకుండా.. తమ షాపులో లిక్కర్ తీసుకున్న వాళ్లకి గుడ్డు, గ్లాస్ తో పాటు, వాటర్ ప్యాకెట్ కూడా ఉచితంగా ఇస్తున్నట్లు ప్రకటించారు. దీంతో మందుబాబులు ఈ ఫ్లెక్సీ చూసి షాక్ అవుతున్నారు. ఇది వైరల్ గా మారింది. కొందరు ఇలా కూడా మార్కెటింగ్ చేస్తారా.. అంటూ ఫన్నీగా కామెంట్లుచేస్తున్నారు.