Group 2 Mains: ఏపీపీఎస్సీ సంచలనం.. నాలుగోసారి గ్రూప్‌ 2 మెయిన్స్‌ వాయిదా

APPSC Group 2 Main Exam Postpone: నిరుద్యోగుల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకున్న ఏపీపీఎస్సీ గ్రూప్‌ 2 పరీక్షను వాయిదా వేసింది. అభ్యర్థుల ఆందోళనను దృష్టిలో ఉంచుకుని ఏపీపీఎస్సీ ఈ నిర్ణయం తీసుకుంది. కాగా పరీక్ష ఎప్పటికి వాయిదా వేసింది? వాయిదాకు కారణం ఏమిటో తెలుసుకుందాం.

1 /7

వాయిదా: నాటి వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ఏపీపీఎస్సీ 899 పోస్టులతో గ్రూప్‌ 2 ప్రకటన విడుదల చేసి ప్రిలిమ్స్‌ నిర్వహించిన విషయం తెలిసిందే. తాజాగా మెయిన్స్‌ నిర్వహించాల్సి ఉండగా కూటమి ప్రభుత్వం వాయిదా వేసింది.

2 /7

అప్పుడు జరగాల్సింది: జనవరి 5వ తేదీన మెయిన్స్‌ పరీక్ష జరగాల్సి ఉండగా ఏపీపీఎస్సీ వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది.

3 /7

విజ్ఞప్తులు: పరీక్ష వాయిదా వేయాలని అభ్యర్థుల నుంచి పెద్ద ఎత్తున విజ్ఞప్తులు రావడంతో కమిషన్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

4 /7

తదుపరి తేదీ: వాయిదా పడిన పరీక్షలు ఫిబ్రవరి 23వ తేదీన నిర్వహించనున్నట్లు ఏపీపీఎస్సీ ప్రకటించింది.

5 /7

సూచన: పరీక్షలకు సంబంధించిన సమాచారం.. ఇతర అప్‌డేట్‌ల కోసం https://psc.ap.gov.in/లో సంప్రదించాలని ఏపీపీఎస్సీ సూచించింది.

6 /7

నోటిఫికేషన్‌ వివరాలు: 2023 డిసెంబర్‌లో గ్రూపు 2 ప్రకటన విడుదల చేయగా.. ప్రిలిమ్స్‌ ఈ ఏడాది ఫిబ్రవరిలో నిర్వహించి ఏప్రిల్‌ 10వ తేదీన ఫలితాలు విడుదల చేశారు. 

7 /7

నాలుగోసారి: గ్రూప్‌ 2 మెయిన్స్‌ పరీక్ష ఇప్పుడు వాయిదా పడడం నాలుగోసారి కావడం చర్చనీయాంశంగా మారింది. జూలై, అక్టోబర్‌, జనవరిలో జరగాల్సిన పరీక్ష మూడుసార్లు వాయిదా పడగా తాజా వాయిదా నాలుగోది.