బచ్చన్ పాండే సినిమా ప్రమోషన్స్ కోసం డిజైనర్ శారీ, స్లీవ్ లెస్ జాకెట్ ధరించిన కృతి మెస్మరైజ్ చేశారు. డీప్ నెక్ జాకెట్‌లో తన బ్యాక్ చూపిస్తూ గ్లామర్ షో చేశారు.
కృతి సనన్ అందచందాలకు తెలుగు ప్రేక్షకులు పడిపోయినా.. సరైన హిట్ దక్కకపోవడంతో టాలీవుడ్‌లో అవకాశాలు రాలేదు. ఆ సమయంలో ఆమెకు బాలీవుడ్‌లో ఆఫర్స్ వచ్చాయి. హీరోపంతి, లూకా ఛుప్పి, హౌస్ ఫుల్ 4 చిత్రాలు మంచి గుర్తింపు తెచ్చాయి.
వన్ సినిమా తర్వాత నాగ చైతన్యతో కలిసి 'దోచేయ్' మూవీ చేశారు. కాలేజ్ స్టూడెంట్‌గా కృతి అలరించారు. ముఖ్యంగా బ్రహ్మానందంతో వచ్చే సీన్లలో అదరగొట్టారు. అయితే ఈ సినిమా సైతం ఆమెకు బ్రేక్ ఇవ్వలేదు.
మోడల్‌గా కెరీర్ ప్రారంభించిన కృతి సనన్.. తెలుగు ఇండస్ట్రీలో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చారు. 2014లో మహేష్ బాబు, సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన 'వన్-నేనొక్కడినే' చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. భారీ అంచలనాల మధ్య విడుదలైన వన్ సినిమాకు నెగిటివ్ టాక్ వచ్చినా.. కృతికి మాత్రం మంచి మార్కులే పడ్డాయి.