Bank Holidays in October: బ్యాంకు పనులు ఏవైనా మీవి పెండింగ్‌లో ఉన్నాయా? అయితే వెంటనే పూర్తి చేసుకోండి.. ఎందుకంటే మరో ఐదు రోజులపాటు బ్యాంకులకు సెలవులు రానున్నాయి. నవరాత్రి, ఎన్నికలు ఇతర పండుగల సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంకులకు సెలవు రానున్నాయి.
అక్టోబర్ 7, 8, 9 తేదీల్లో బ్యాంకులు యథావిధిగా పనిచేస్తాయి. అయితే, 10వ తేదీ దుర్గాపూజ సందర్భంగా ఈరోజు బ్యాంకులకు సెలవు రానుంది. ఈ నేపథ్యంలో అగర్తలా, గువహాటీ, కొహీమా, కోల్‌కతాలో బ్యాంకులకు సెలవు రానుంది. అంతేకాదు ఈ రోజు తెలంగాణలో కూడా సద్దుల బతుకమ్మ నిర్వహిస్తారు. ప్రభుత్వానికి సాధారణ సెలవు ఇవ్వాలని ఉద్యోగులు కూడా రిక్వెస్ట్ పెట్టారు.
ఇక అక్టోబర్ 11వ తేదీ దసరా సందర్భంగా కొన్ని ప్రాంతాల్లో బంద్, మరికొన్ని ప్రాంతాల్లో ఆయుధపూజ, దుర్గ అష్టమి సందర్భంగా అగర్తలా, బెంగళూరు, భువనేశ్వర్, చెన్నై, గ్యాంగ్‌టక్, గువహటీ, ఇంపాల్, ఇటా నగర కోల్‌కతా, కొహీమా, రాంచీ, పాట్నా, షిల్లాంగ్ ప్రాంతాల్లో బ్యాంకులు బంద్ ఉండనున్నాయి.
అక్టోబర్ 12వ తేదీ తెలుగు రాష్ట్రాల్లో దసరా పండుగ నిర్వహించనున్నారు. అంతేకాదు ఈ రోజు రెండో శనివారం కూడా కాబట్టి బ్యాంకులకు సెలవు రానుంది. నవరాత్రులు అక్టోబర్ 3వ తేదీ ప్రారంభమయ్యాయి. దసరాతో ముగుస్తుంది. ప్రతి ఏడాది ఈ శరన్నవరాత్రులు సెప్టెంబర్, అక్టోబర్ నెలలో వస్తాయి.
అక్టోబర్ 13వ తేదీ కూడా దేశవ్యాప్తంగా ఉన్న అన్నీ పబ్లిక్, ప్రైవేటు రంగ బ్యాంకులు బంద్ ఉంటాయి. ఎందుకంటే ఈరోజు ఆదివారం. ఇక 14వ తేదీ దుర్గాపూజ కొన్ని ప్రాంతాల్లో నిర్వహిస్తారు. ఈ సందర్భంగా కొన్ని ప్రాంతాల్లో బ్యాంకులు బంద్ ఉండనున్నాయి. ముఖ్యంగా గ్యాంగ్‌టక్‌లో బ్యాంకులు బంద్ ఉండనున్నాయి.
సాధారణంగా ప్రతి రెండో, నాలుగో శనివారం, ప్రతి ఆదివారం కూడా అన్ని బ్యాంకులు బంద్ ఉంటాయి. ఒకవేళ 5వ శనివారం ఏదైనా నెలలో వస్తే అది వర్కింగ్ డే గా పరిగణిస్తారు. మాములుగా ప్రతి శనివారాలు కూడా సగం రోజు పనిచేస్తాయి. అయితే, బ్యాంకులకు కొన్ని సెలవులు ఆర్‌బీఐ గైడ్‌లైన్స్ ప్రకారం అమలు చేయగా, మరికొన్ని సెలవులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ధేశిస్తాయి.