Diwali 2023 Gifts: హిందూవులకు దీపావళి అత్యంత ముఖ్యమైన పండుగ. దేశమంతా ఘనంగా జరుపుకున్నా ఉత్తరాదిన మరింత వైభవంగా జరుపుకుంటారు. అందుకే దీపావళికి బంధుమిత్రులకు ప్రత్యేక బహుమతులు ఇచ్చుకుంటుంటారు. మీరు కూడా మీ బంధుమిత్రులకు బహుమతులివ్వాలనుకుంటే మీ కోసం కొన్ని ఐడియాలు ఉన్నాయి.
Samsung Galaxy F34 5G శాంసంగ్ గెలాక్సీ ఎఫ్ 34 5జి ప్రారంభధర 16,499 రూపాయలుగా ఉంది. ఇందులో 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్‌తో పాటు అద్భుతమైన ఎమోల్డ్ డిస్‌ప్లే కలిగి ఉంది. ఈ ఫోన్ బ్యాటరీ బ్యాకప్ చాలా ఎక్కువ. ఏకంగా 6000 ఎంఏహెచ్ బ్యాటరీ కలిగి ఉంటుంది.
రియల్‌మి 115జి రియల్‌మి 115జి ప్రారంభధర 15,999 రూపాయలు. ఈ ఫోన్ డైమెన్షన్ 6100+ 5G SoCతో నడుస్తుంది. ఫోన్ 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ , 240 హెర్ట్జ్ రెస్పాన్స్ రేట్‌తో 6.72 ఇంచెస్ ఫుల్ హెచ్‌డి ప్లస్ డిస్‌ప్లే కలిగి ఉంటుంది. 108 మెగాపిక్సెల్ డ్యూయల్ రేర్ కెమేరా సిస్టమ్ కలిగి ఉంటుంది.
Samsung Galaxy Watch 6 ఈ దీపావళికి మీకు బాగా కావల్సినవారికి ఖరీదైన బహుమతి ఇవ్వాలనుకుంటే శాంసంగ్ గెలాక్సీ వాచ్ 6. దీని ధర 27,999 రూపాయలు. గెలాక్సీ వాచ్ 6 బ్రైట్ డిస్‌ప్లే, అద్భుతమైన బ్యాటరీ కలిగి ఉంటుంది.
boAt Storm Plus బోట్ స్టార్మ్ ప్లస్ ప్రారంభధర 2,999 రూపాయలు. ఈ స్మార్ట్ వాచ్‌లో 1.78 ఇంచెస్ ఎమోల్డ్ డిస్‌ప్లే ఉంది. దీపావళికి బహుమతిగా ఇచ్చేందుకు చాలా బాగుంటుంది. కచ్చితంగా అందరికీ ఉపయోగపడే బహుమతి ఇది.
Realme Buds Air 5 రియల్‌మి ఎయిర్ బడ్స్ 5 ధర 2,999 రూపాయలే. దీపావళికి బహుమతిగా ఇచ్చేందుకు బాగుంటుంది. ఇందులో 50డీబీ యాక్టివ్ నాయిస్ కాన్సిలేషన్, 4000 హెర్ట్జ్ అల్ట్రా వైడ్ బ్యాండ్ నాయిస్ క్యాన్సిలేషన్ , 6 మైక్ కాల్ నాయిస్ క్యాన్సిలేషన్ ఉన్నాయి.