Weight Control Remedy: ఇటీవలి కాలంలో అధిక బరువు లేదా స్థూలకాయం ప్రధాన సమస్యగా మారింది. చాలామంది చాలా రకాలుగా ప్రయత్నించి విఫలమౌతుంటారు. అయితే చిన్నగా ఉండి ఆకు పచ్చ రంగులో ఉండే ఈ విత్తనాలు తింటే అధిక బరువు సమస్య సులభంగా తొలగిపోతుంది.
సూప్ రూపంలో సూప్ లేదా శాండ్విచ్ హెల్తీగా మార్చుకోవాలంటే ఇందులో కొద్దిగా ఫ్రై చేసిన ఆనపకాయ గింజలు కలిపి తీసుకోవాలి. బరువు సులభంగా తగ్గుతుంది.
ఓట్స్ లేదా యోగర్ట్‌తో కలిపి బ్రేక్ ఫాస్ట్‌లో ఓట్స్ లేదా యోగర్ట్ కలిపి తినడం వల్ల మీ డైట్ చాలా హెల్తీగా ఉంటుంది. ఇవి తినడం వల్ల రోజంతా ఎనర్జీ లభిస్తుంది. మెటబోలిజం వేగవంతం అవుతుంది.
స్మూదీ రూపంలో బరువు తగ్గించేందుకు ఆనపకాయ విత్తనాలు అద్భుతంగా ఉపయోగపడతాయి. ఒక స్పూన్ ఫ్రై చేసిన ఆనపకాయ విత్తనాలను స్మూదీలో కలిపి తినవచ్చు. దీనివల్ల పోషకాలు ఎక్కువగా లభించి దీర్ఖకాలం ఆకలేయదు.
సలాడ్ రూపంలో.. మీరు తీసుకునే సలాడ్ పోషక విలువలతో నిండుగా ఉండాలంటే ఫ్రై చేసిన ఆనపకాయ గింజలు బెస్ట్ అని చెప్పవచ్చు. ఇవి రుచికరంగా ఉండటమే కాకుండా పోషకాలు ఎక్కువగా ఉంటాయి. బరువు తగ్గించేందుకు అద్భుతంగా ఉపయోగపడతాయి.
స్నాక్స్.. ఆనపకాయ గింజల్ని ఫ్రై చేసి స్నాక్స్ రూపంలో తింటే మంచి ఫలితాలుంటాయి. సాధారణంగా ఆకలేసినప్పుడు చిప్స్, ఫ్రైడ్ పదార్ధాలు తినకుండా ఆ స్థానంలో ఫ్రై చేసిన ఆనపకాయ గింజలు తినాలి. ఇందులో ఫైబర్, ప్రోటీన్లు ఎక్కవగా ఉండటం వల్ల కడుపు ఎక్కువసేపు నిండుగా ఉంటుంది.