Pitru Paksha 2024: మహాలయ పక్షంలో ఈ రాశుల వారు జాగ్రత్త పడడం మంచిది.. మీ రాశి కూడా ఉందా..?

Mahalaya Paksha 2024: ఈ ఏడాది మహాలయ పక్షం చంద్రగ్రహణం రోజున అంటే సెప్టెంబర్ 18వ తేదీన మొదలై సూర్యగ్రహణం అనగా అక్టోబర్ రెండవ తేదీన పూర్తవుతుంది..ఈ 15 రోజులను మహాలయపక్షంగా పిలుస్తారు.  అయితే ఈ కాలంలో కొన్ని రాశుల వారికి తీవ్రమైన ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని పండితులు చెబుతున్నారు.  మరి ఆ రాశులు ఏవి?  వారికి ఎలాంటి సమస్యలు ఎదురవుతాయి అనే విషయాలు ఇప్పుడు చూద్దాం. 

1 /5

ఈ ఏడాది దాదాపు 15 రోజులపాటు మహాలయ పక్షం ఏర్పడింది. ఈ మహాలయ పక్షం వేళ కొన్ని రాశుల వారికి అశుభంగా పరిగణిస్తున్నారు పండితులు. ముఖ్యంగా. మేషం,  మిథునంతో సహా మొత్తం 4 రాశుల వారికి అశుభ ఫలితాలు ఏర్పడనున్నాయట. ఎందుకంటే సూర్యగ్రహణ సమయంలో శనితో సూర్యుడికి షడష్టక్ యోగం ఏర్పడుతుందట. ఇది అశుభకరమైనదిగా పరిగణించబడుతోంది. ముఖ్యంగా ఈ సమయంలో కొన్ని రాశుల జీవితాలలో పెను మార్పులు సంభవిస్తాయని , ఇంట్లో ఎవరైనా సరే అకస్మాత్తుగా అనారోగ్యానికి గురి కావచ్చని, కెరియర్ లేదా వ్యాపారంలో నష్టం రావచ్చని పండితులు చెబుతున్నారు.   

2 /5

ఈ రాశి వారికి.. ప్రస్తుతం జరుగుతున్న మహాలయ పక్షం అంత మంచిది కాదు. వ్యాపారం చేసే ఆలోచన ఉంటే కొత్త ప్రయోగాలు చేయవద్దు. డబ్బు ఎక్కడ పెట్టుబడి గా పెట్టకూడదు.  స్నేహితులతో సమయాన్ని గడుపుతూ ఆనందిస్తారు. సమస్యలను పరిష్కరించడంలో ఆ స్నేహితులు సహాయపడతారు. 

3 /5

ఈ రాశి వారి జీవితంలో అనేక మార్పులు సంభవించవచ్చు. కలలో కూడా ఊహించని సమస్యలు తలెత్తుతాయి. చెడు వార్తలు వింటారు. ఇది మీ జీవితం పై చాలా లోతైన ప్రభావాన్ని కూడా చూపిస్తుంది. ఆర్థిక నష్టం కలుగుతుంది. ఎఫైర్ లో ఉన్న వ్యక్తులు వారి భాగస్వామి చేత మోసపోవచ్చు కూడా.. వైవాహిక బంధంలో ఒడిదుడుకులు ఏర్పడతాయి.   

4 /5

ఈ సమయంలో ఈ రాశి వారు భావోద్వేగాలకు లోను అవుతారు. ఒంటరిగా అనుభూతి చెందుతారు. మీ జీవితంలో నిరాశ పెరుగుతుంది. మీ గురించి కూడా మీరు శ్రద్ధ వహించాలి .మీ అభిప్రాయాలను ఎవరితోనైనా పంచుకునే ముందు ఆలోచించాలి. 

5 /5

ఈ 15 రోజులలో కన్య రాశి వారు మరింత జాగ్రత్తగా ఉండాలి. ఆకస్మిక మార్పులు చోటు చేసుకుంటాయి. తండ్రి లేదా అన్నయ్యతో సంబంధం ప్రభావితం కావచ్చు. వ్యాపారాలు మరింత నష్టాన్ని మిగులుస్తాయి. ఉద్యోగులకు ఆఫీసులో నిరాధార ఆరోపణలతో ఇరికించే కుట్ర జరుగుతుంది జాగ్రత్తగా ఉండాలి.