Bigg Boss Telugu 8: బిగ్‌ బాస్‌ ఫ్యాన్స్‌కు బిగ్‌ షాకిచ్చిన హాట్‌బ్యూటీ‌.. వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీపై నటి జ్యోతిరాయ్‌ క్లారిటీ..!

Big Shock To Bigg Boss: ప్రస్తుతం బిగ్‌ బాస్‌ 8 సీజన్‌ నడుస్తోంది. ఈ రియల్టీ షో ప్రతిరోజూ మాటీవీ లో ప్రారంభమవుతుంది. ప్రస్తుతం రెండో ఎలిమేనేషన్‌ రేపు జరగనుంది. ఇప్పటికే నామినేషన్‌ కూడా జరిగింది. మొదటి వారం ఎలిమినేషన్‌లో బెజవాడ బేబక్క హౌజ్‌ నుంచి ఎలిమినేట్‌ అయిపోయారు.
 

1 /6

 ఈ వారం ఎలిమినేషన్‌లో విష్ణుప్రియ, ఆదిత్య ఓం, నాగమణికంఠ, శేఖర్‌ భాషా, పృథ్వీరాజ్‌, నిఖిల్‌, సీతా, నైనికా ఉన్నారు. వీరిలో ఎవరు ఎలిమినేట్‌ అయ్యేది రేపు ఆదివారం ఎలిమినేషన్‌లో తెలిసిపోతుంది. అయితే, వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ ఇప్పటి వరకు జరగలేదు. అయితే, కొన్ని వార్తా పత్రికల నివేదిక ప్రకారం నటి జ్యోతిరాయ్‌ మొదటి వైల్డ్‌ కార్డు ఎంట్రీ ఇవ్వనున్నారు అనే పుకార్లు వచ్చాయి.  

2 /6

జ్యోతిరాయ్‌ ప్రముఖ 'గుప్పెడంత మనస్సు' సీరియల్‌లో నటించిన జగతి మేడమ్‌. ఈమె ప్రముఖ తెలుగు, కన్నడ సీరియల్‌ యాక్టర్‌. జ్యోతిరాయ్‌ అసలు పేరు జ్యోతి పూర్వజ్‌ (జయ శ్రీ రాయ్‌ కేకే). ఈమె ప్రముఖ సీరియల్‌ నటి. ఎన్నో భాషల్లో నటించారు. కొన్ని సినిమాల్లో కూడా ఉన్నారు. ప్రస్తుతం వైల్డ్‌ కార్డు ఎంట్రీ ద్వారా బిగ్‌ బాస్‌ సీజన్‌ 8 తెలుగులోకి అడుగుపెట్టబోతున్నారు అని వార్తలు వచ్చాయి.  

3 /6

జ్యోతిరాయ్‌ 1985 ఫిబ్రవరి 23న కర్నాటకలోని మెడికెరీలో జన్మించారు. ప్రస్తుతం ఆమె వయస్సు 39 ఏళ్లు. తెలుగు, కన్నడ ప్రేక్షకులను తన నటనతో కట్టిపడేశారు. ఆమె నటనా నైపుణ్యత ఎంతగానో ఆకట్టుకుంటాయి. గుప్పెడంత మనస్సు మాటీవీ సీరియల్లో ఆమె జగతి మేడమ్‌గా నటించి తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యారు.  

4 /6

అంతేకాదు ఈ యాక్టర్‌ హిందీ, ఇంగ్లిష్‌, తెలుగు, మళయాలం, తమిళ్‌, కన్నడ, తుళు కూడా మాట్లాడగలరు. అందుకే ఆమె ఏ భాషలో నటించినా అందరి మన్ననలు పొందారు అంతమంది ప్రేక్షకులను సంపాదించుకున్నారు. మోడల్‌గా కెరీర్‌ ప్రారంభించిన జ్యోతిరాయ సినిమా హిరోయిన్‌కు ఉన్న క్రేజ్‌ ఉంది. ప్రస్తుతం ఈమె ఓ డైరెక్టర్‌ను రెండో పెళ్లి చేసుకున్నారు.  

5 /6

సోషల్ మీడియాలో తన హాట్‌ ఫోటోలను షేర్‌ చేస్తూ ఉంటుంది. ఇప్పటి వరకు ఈ బిగ్‌ బాస్‌ సీజన్‌ను డైలీ సీరియల్‌ చూసినట్లు చూస్తున్నారు. టీఆర్‌పీరేటింగ్‌లో తేడా వచ్చిందట. అయితే, జగతి మేడమ్‌ కంబ్యాక్‌ తో బిగ్‌ బాస్‌ హౌజ్‌ హోరెత్తిపోనుంది అని బిగ్‌ బాస్ లవర్స్‌ అనుకున్నారు.   

6 /6

అయితే, హౌజ్‌లోకి ఎంట్రీపై క్లారిటీ ఇచ్చారు జగతి మేడమ్‌ ప్రస్తుతం తాను నాలుగు తెలుగు సినిమాలు చేస్తున్నానని ఏ రియాల్టీ షోలో తాను పాల్గొనట్లేదని క్లారిటీ ఇచ్చారు.