Bigg Boss Telugu 8 : యష్మీ ఔట్.. 12 వారాలలో ఎంత రెమ్యునరేషన్ అందుకుందంటే..?

Bigg Boss Yashmi Gowda: తెలుగు బుల్లితెర ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటూ సీరియల్స్ తో తనకంటూ మంచి ఇమేజ్ దక్కించుకుంది యష్మీ గౌడ. ప్రస్తుతం కృష్ణా ముకుందా మురారి సీరియల్ తో భారీ పాపులారిటీ అందుకున్న ఈమె బిగ్ బాస్ సీజన్ 8లోకి కంటెస్టెంట్ గా అడుగుపెట్టింది.

1 /5

కన్నడ ఇండస్ట్రీకి చెందిన చాలామంది ముద్దుగుమ్మలు తెలుగు బుల్లితెర సీరియల్స్ లో నటిస్తూ భారీ పాపులారిటీ అందుకుంటున్నారు. ఈ క్రమంలోనే బిగ్ బాస్ రియాల్టీ షోలోకి కూడా అడుగుపెట్టి, తమ స్ట్రాటజీతో మంచి కంటెంట్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు.  అలాంటి వారిలో యష్మి కూడా ఒకరు. కర్ణాటక నుంచి వచ్చిన అమ్మాయి అయినా తెలుగు చక్కగా మాట్లాడుతూ తెలుగు ఆడియన్స్ ను మెప్పించింది.  

2 /5

తన అద్భుతమైన నటనతో, మాట తీరుతో అందరినీ ఆకట్టుకున్న ఈమె బిగ్ బాస్ సీజన్ 8లోకి అడుగు పెట్టింది. తన స్నేహితులు అయిన నిఖిల్, ప్రేరణ, పృథ్వీ లను కాపాడుకుంటూ.. వీరు తప్పు చేసినా.. ఎదుటివారిని బలి చేస్తూ తనదైన ఆటతీరుతో అందరిని ఆకట్టుకుంది ఇక నామినేషన్స్ వచ్చేసరికి చంద్రముఖిలా మారిపోయి ప్రవర్తిస్తూ ఉంటుంది. 

3 /5

ఇకపోతే టాప్ ఫైవ్ లో ఉంటుందని,  స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా ప్రూవ్ చేసుకున్న ఈమె అనూహ్యంగా 12వ వారం ఎలిమినేట్ అయింది. వాస్తవానికి నామినేషన్ లోకి రాగానే ఓటింగ్ నిర్వహించగా ,యష్మి రెండవ స్థానానికి చేరుకుంది. కానీ హౌస్ లో విష్ణుప్రియ తో గొడవపడడం వల్ల ఆమెపై నెగెటివిటీ పెరిగింది. దాంతో ఓట్లు పడలేదు ఇక చివరికి పృథ్వి , యష్మీ లీస్టులో ఉండగా యష్మీ ఎలిమినేట్ అయింది.  

4 /5

ఇకపోతే 12 హౌస్ లో కొనసాగిన ఈమె.. ఎంత రెమ్యునరేషన్ తీసుకుంది అనే విషయాలు వైరల్ గా మారుతున్నాయి.వారానికి రూ  2లక్షల చొప్పున ఒప్పందంతో హౌస్ లోకి అడుగుపెట్టిన ఈమె మొత్తం 12 వారాలపాటు హౌస్ లో ఉంది. కాబట్టి వారానికి రెండు లక్షలు చొప్పున 12 వారాలకు 24 లక్షల రూపాయలను సొంతం చేసుకుంది యష్మి. 

5 /5

ఒకరకంగా చెప్పాలి అంటే ఏడాది పాటు సీరియల్స్ లో నటిస్తే రాని అమౌంట్,కేవలం మూడు నెలల్లోనే బిగ్ బాస్ ద్వారా అందుకుంది అంటే ఇక ఎంతగా లాభం పొందిందో అర్థం చేసుకోవచ్చు.