BSNL Recharge Plan: బీఎస్ఎన్ఎల్ నుంచి కొత్త రీఛార్జ్ ప్లాన్ వచ్చింది. ఈ ప్లాన్ నిజంగానే ఇతర కంపెనీలకు గట్టి పోటీ ఇవ్వనుంది. ఈ ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకుంటే రోజుకు 3 రూపాయలు కూడా ఖర్చు కాదు. అటు వ్యాలిడిటీ కూడా చాలా ఎక్కువ. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
BSNL Recharge Plan: ప్రైవేట్ టెలీకం కంపెనీలు ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియా, రిలయన్స్ జియోలు టారిఫ్ రేట్లు పెంచడంతో గత కొద్దికాలంగా బీఎస్ఎన్ఎల్‌కు ఆదరణ పెరుగుతోంది. అదే సమయంలో దీర్ఘకాలిక వ్యాలిడిటీ కలిగిన ప్లాన్స్ తక్కువ ధరలో లభిస్తుండటంతో చాలామంది బీఎస్ఎన్ఎల్‌కు పోర్ట్ అవుతున్నారు.
బీఎస్ఎన్ఎల్ తన కస్టమర్ల కోసం వివిధ రకాల ప్లాన్స్ అందిస్తోంది. ఇందులో 26 రోజుల్నించి 395 రోజుల వ్యాలిడిటీ వరకూ ప్లాన్స్ ఉన్నాయి. బీఎస్ఎన్ఎల్‌లో ఉచిత అన్‌లిమిటెడ్ కాలింగ్, ఎస్ఎంఎస్, డేటా అన్నీ అతి తక్కువ ధరకే లభించనున్నాయి. అందుకే గత 2 నెలల్లో ఏకంగా 55 లక్షలమంది కస్టమర్లను పొందింది.
బీఎస్ఎన్ఎల్ 797 ప్లాన్ ఈ ప్లాన్‌లో 300 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. దీంతోపాటు అన్‌లిమిటెడ్ కాలింగ్, ఉచిత ఎస్ఎంఎస్, రోజుకు 2 జీబీ డేటా లభిస్తుంది.
అంతేకాకుండా మొదటి 60 రోజులు దేశవ్యాప్తంగా ఎనీ నెట్‌వర్క్ అన్‌లిమిటెడ్ కాలింగ్ ఉంటుంది. దీర్ఘ కాలిక వ్యాలిడిటీ కోసమైతే ఇది బెస్ట్ ప్లాన్ కాగలదు. ఎందుకంటే రోజుకు 3 రూపాయలు కూడా ఖర్చు కాదు.
ఇదే ధరకు ఇతర ప్రైవేట్ టెలీకం కంపెనీల్లో అయితే 84 రోజుల వ్యాలిడిటీ కూడా లభించని పరిస్థితి. అతి తక్కువ ధరకే ఎక్కువ రోజుల వ్యాలిడిటీ ఉంటుంది.