AP Police Constable Physical Test: ఏపీ ప్రభుత్వం కానిస్టేబుల్ అభ్యర్థులకు భారీ గుడ్న్యూస్ చెప్పింది.కొన్ని కారణాల వల్ల నిలిచిపోయిన 6100 పోస్టుల భర్తీకి వచ్చే నెల డిసెంబర్ చివరి వారంలో అభ్యర్థుకు ఫిజికల్ టెస్ట్ నిర్వహించనున్నట్లు ప్రకటించింది. గత ఏడాది కానిస్టేబుల్ పోస్టుల భర్తీ నేపథ్యంలో ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. వీటిపై ఇప్పుడు మరో కీలక అప్డేట్ విడుదల చేసింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానిస్టేబుల్ అభ్యర్థులకు తీపికబురు అందించారు. గత ప్రభుత్వం కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇది గత ఏడాది జనవరిలో జరిగింది, అయితే కొన్ని కారణాల వల్ల ఫిజికల్ టెస్ట్ నిలిపివేశారు.
ప్రస్తుతం వారికి దేహదారుఢ్య పరీక్ష నిర్వహించడానికి ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. కొన్ని కారణాల వల్ల వారి ఎంపిక ప్రక్రియ నిలిచిపోయింది. ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు డిసెంబర్ చివరి వారంలో ఫిజికల్ టెస్ట్ నిర్వహించనుంది.
2022లో 6100 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ గత ప్రభుత్వం విడుదల చేసింది. ఈ పోస్టుల భర్తీకి గత ఏడాది జనవరి నెలలో ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. వీరి నుంచి ఈ నెల 11 నుంచి 21 వరకు ఫిజికల్ టెస్టులకు దరఖాస్తులు స్వీకరించే అవకాశం ఉంది.
వైసీపీ ప్రభుత్వం 2022 లోనే 6,100 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనికి 4,59,182 మంది ప్రిలిమినరీ టెస్టు హాజరయ్యారు. ఈ పరీక్షలో అర్హత సాధించింది 95,208 మంది. ఇందులో కొంతమంది ఫిజికల్ టెస్టుకు దరఖాస్తు చేసుకోలేదు. వారికి మరోసారి ఏపీ ప్రభుత్వం అవకాశం ఇవ్వనుంది.
కానిస్టేబుల్ అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ slprb.ap.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ప్రకటించిది. అయితే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక్కో హామీని నెరవేరుస్తు వస్తోంది. ఏడాదికి మూడు సిలిండర్ల పథకం కూడా అమల్లోకి తీసుకువచ్చింది. తాజాగా నిలిచిపోయిన కానిస్టేబుల్ ఎంపిక ప్రక్రియను కూడా తిరిగి ప్రారంభించింది.