Women Scheme: మహిళలకు మోదీ సర్కార్‌ బంపర్‌ ఆఫర్.. నెలకు రూ.7,000 స్టైఫండ్‌.. 70 ఏళ్ల వరకు అర్హులే..!

LIC Bima Sakhi Yojana:  మహిళలకు మోదీ సర్కార్‌ బంపర్‌ ఆఫర్ ప్రకటించారు. దీంతో వారికి ప్రతినెలా రూ.7,000 రూపాయలు వారి ఖాతాల్లో జమ అవుతాయి. కేంద్ర ప్రభుత్వ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (LIC) ద్వారా ఈ స్టైఫండ్ అందుతుంది. ఈ పథకాన్ని మోదీ ప్రారంభించారు.
 

1 /7

ఈ పథకానికి మీరు కూడా అర్హులు కావాలంటే కేవలం పదో తరగతి చదివితే చాలు. వయస్సు 18 ఏళ్ల నుంచి 70 ఏళ్లలోపు ఉన్నవారు ఈ పథకానికి అర్హులు..  

2 /7

ఈ పథకానికి దరఖాస్తు చేసుకున్న మహిళలను ఎంపిక చేసి మూడేళ్లపాటు వారికి ఆర్థిక, బీమా అంశాలపై తగిన శిక్షణ అందిస్తారు. ఆ తర్వాత మొదట్లో రూ.7 వేలు స్టైఫండ్‌గా అందజేస్తారు.  

3 /7

ఆ తర్వాతి ఏడాది రూ.6 వేలు, మూడో ఏడాది సమయంలో రూ. 5 వేలు ప్రతి ప్రతినెలా స్టైఫండ్‌ రూపంలో మహిళలకు చెల్లిస్తారు. ఆ శిక్షణ కాలం పూర్తయిన తర్వాత వారిని ఎల్‌ఐసీ ఏజెంట్‌గా పనిచేసే అవకాశం కూడా దక్కుతుంది.  

4 /7

ఈ పథకంలో ఏడాదిలో లక్ష మందిని నియమించనున్నట్లు ఎల్‌ఐసీ ఎండీ సిద్ధార్థ్‌ మహంతి చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ పథకాన్ని సోమవారం ప్రారంభించారు. ఈ పథకం పూర్తి పేరు బీమ సఖి యోజన. మహిళా సాధికారతకు ఎల్‌ఐసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు.  

5 /7

ఎల్‌ఐసీ ఏజెంట్‌గా నియమితులైన మహిళలకు నెలకు కనీసం రూ.15,000 జీతం పొందవచ్చని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పనిపట్‌లో ఈ పథకాన్ని ప్రారంభించే సమయంలో అన్నారు.  

6 /7

మొదటి ఏడాది లక్ష మంది లక్ష్యంగా పనిచేయనుంది. ఆ తర్వాత ఏడాది రెండు లక్షల మందిని నియమించనుంది. పదో తరగతి చదివిన 25 వేలమంది మహిళలకు ఈ పథకం ద్వారా నియమించనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌ ప్రకటించారు.  

7 /7

ఐఆర్‌డీఏఐ ఈ మహిళలకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. ఎల్‌ఐసీ మొదటి ఏడాది బీమ సఖి యోజన ద్వారా రూ.840 కోట్లు కేటాయిస్తుందని సిద్ధార్థ మొహంతీ చెప్పారు. ఇక ఏడాదిలో కనీసం 24 పాలసీలు విక్రయించిన మహిళలకు స్టైఫండ్‌ కాకుండా అదనంగా కమీషన్‌ కూడా అందించనున్నట్లు చెప్పారు.