Business Ideas: ఇంట్లో నుంచి కాలు బయటపెట్టకుండా..రోజుకు 5వేలు సంపాదించే బిజినెస్..లేడీస్ మీకోసమే..

Business Ideas: మనలో చాలా మంది మహిళలు ఇంటి పనులు పూర్తయ్యాక ఖాళీగా ఉంటారు. అలాంటి వారికి ఇది చక్కటి బిజినెస్. ఈ బిజినెస్ చేస్తే మంచి ఆదాయం పొందవచ్చు. ఎలాంటి బిజినెస్, ఎంత పెట్టుబడి పెట్టాలి..ఎంత లాభం వస్తుందన్న విషయాలు తెలుసుకుందాం. 
 

1 /7

Business Ideas: లేడీస్ మీరు ఏదైనా బిజినెస్ ప్రారంబించాలని ప్లాన్ చేస్తున్నారా. అయితే మీకో మంచి బిజినెస్ ప్లాన్ తీసుకువచ్చాము. మీరు వంటల్లో మంచి ప్రావీణ్యం ఉన్నట్లయితే బిర్యానీ బిజినెస్ అనేది చక్కటి వ్యాపారం అని చెప్పవచ్చు. ముఖ్యంగా మాంసాహారం, శాఖాహారంతో వెజ్, నాన్ వెజ్ బిర్యానీ తయారు చేసి ఇంట్లో నుంచే విక్రయించినట్లయితే మంచి లాభాలను పొందవచ్చు. 

2 /7

అయితే బిర్యానీ వ్యాపారం కొత్తదనం ఏముందని అనుకుంటున్నారా. ప్రతిరోజూ కస్టమర్లు వచ్చి ఇంటి వద్ద కొనడం ఎలా సాధ్యం అవుతుందని అని అనుకుంటున్నారా.

3 /7

మీరు నేరుగా కస్టమర్లకు కాకుండా బల్క్ రూపంలో బిర్యానీ హండీలను తయారు చేసి చిన్న చిన్న ఫంక్షన్లకు క్యాటరింగ్ సర్వీసులకు, బిర్యానీ సెంటర్లకు సప్లయ్ చేస్తే ఒక్కో హండి పై మీకు 30 నుంచి 50శాతం వరకు లాభం వస్తుంది.   

4 /7

మీరు ఈ వ్యాపారం ప్రారంభించాలనుకుంటే ముందుగా ఆర్డర్లను పొందిన తర్వాతే హండి బిర్యానీ తయారు చేసి వారికి అందించినట్లయితే మీకు మంచి లాభం ఉంటుంది.

5 /7

ఉదాహరణకు 30 మందికి సరిపోయే చికెన్ బిర్యానీ హండి తయారీకి రూ. 30వేలు వరకు ఖర్చు అవుతుంది. బయట మాత్రం 6 నుంచి 8వేలకు విక్రయిస్తారు. 

6 /7

బిర్యానీ క్వాలిటీలో అదే విధంగా రుచి చక్కగా ఉంటే ఈ వ్యాపారంలో మీరు ఎక్కువ కాలం రాణించే అవకాశం ఉంటుంది. వ్యాపారం పెరిగే కొద్దీ మీరు క్యాటరింగ్ సర్వీస్ కూడా ప్రారంభిస్తే మరింత అదనపు ఆదాయం పొందవచ్చు.   

7 /7

రోజుకు కనీసం 2 నుంచి 3 హండీలను విక్రయిస్తే మీకు కనీసం 5వేల నుంచి 8 వేల వరకు మిగులుతుంది.