Business Ideas: వ్యాపారం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారా అయితే ఓ చక్కటి బిజినెస్ ఐడియా గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Business Ideas: ఈ బిజినెస్ చేయడం ద్వారా మీరు ప్రతి నెల ఒక లక్ష రూపాయల వరకు సంపాదించే అవకాశం ఉంటుంది. సీజన్లో ఈ బిజినెస్ చేయడం ద్వారా నెలకు రెండు నుంచి మూడు లక్షల వరకు సంపాదించవచ్చు అలాంటి చక్కటి బిజినెస్ ఐడియా గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
దీనికి పెట్టుబడి కూడా చాలా తక్కువగానే ఉంటుంది. ఒకసారి పెట్టుబడి పెడితే చాలు మీకు సమాచారం అంతా ఇంకా లభించే అవకాశం ఉంటుంది. అదే చెరుకు రసం బిజినెస్. చెరుకు రసం అనగానే మనందరికీ రోడ్డు పక్కన కనిపించే అపరిశుభ్ర వాతావరణంలో తీసే బండ్లు మాత్రమే గుర్తొస్తాయి. ఈ చెరుకు బండ్లు అపరిశుభ్రమైన వాతావరణంలో ఈగలు ముసురుతూ రోడ్డు పక్కన, ఆరోగ్యకరంగాని ఐసుతో జ్యూస్ తయారు చేస్తూ ఉంటారు.
వీటిని తాగితే అనారోగ్యం పాలే అవకాశం ఉంటుంది. అందుకు ప్రత్యామ్నాయంగా ఆరోగ్యకరమైన విధానంలో సంపూర్ణమైన పరిశుభ్రతతో ఫ్రెష్ గా చల్లటి చెరుకు రసం తాగాలని చాలామందికి అనిపిస్తుంది. ఇదే మీ బిజినెస్ ఐడియాకు అసలైన పెట్టుబడిగా భావించవచ్చు. ప్రస్తుతం మార్కెట్లో షుగర్ కేన్ జూసర్లు అద్భుతంగా పూర్తి పరిశుభ్రతతో జ్యూస్ తయారు చేస్తున్నాయి.
ఈ షుగర్ కేన్ జ్యూస్ నిజానికి ఆరోగ్యానికి ఎంతో మంచిది. ముఖ్యంగా కిడ్నీలో రాళ్లు ఉన్నవారికి చెరకు రసం తాగితే అవి కరిగిపోతాయని వైద్యులు చెబుతున్నారు. లివర్ కూడా ఎంతో బాగా పనిచేయడానికి ఈ షుగర్ కేన్ జ్యూస్ అనేది ఉపయోగపడుతుంది.
ఇప్పుడు బిజినెస్ విషయానికి వస్తే ప్రస్తుతం మార్కెట్లో షుగర్ కేన్ జ్యూస్ సెంటర్ ఓపెన్ చేయడానికి మీకు మంచి బిజినెస్ సెంటర్లో ఫుడ్ స్టాల్ లాంటిది ఏర్పాటు చేసుకుంటే సరిపోతుంది. అందులో మీరు ఈ షుగర్ కేన్ జ్యూస్ మెషీన్ ఇన్ స్టాల్ చేయవచ్చు. ఈ మిషన్ ధర 40 వేల రూపాయల నుంచి ప్రారంభం అవుతుంది.
అమెజాన్ లో సైతం ఈ మిషన్ అందుబాటులో ఉంది. ఆన్లైన్ ద్వారా కూడా ఈ మిషన్ కొనుగోలు చేయవచ్చు. ఇక చల్లటి చెరుకు రసం కోసం ఇందులో మీరు ఐస్ కలపాల్సిన అవసరం లేదు. ఇందుకోసం ఒక చిన్న టెక్నిక్ ఉపయోగిస్తే మంచిది. చెరుకు గడలను చిన్న ముక్కలుగా కట్ చేసుకుని. వాటిని ముందు రోజే ఫ్రిజ్లో పెట్టి ఉంచినట్లయితే చల్లగా మారిపోతాయి. ఆ తర్వాత వాటి నుంచి తీసే జ్యూస్ కూడా చల్లగా ఉంటుంది.
ఈ విధంగా మీరు పరిశుభ్రమైన వాతావరణంలో చెరకు రసం తయారు చేసినట్లయితే, చక్కటి ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. ఎండాకాలం వంటి సీజన్లో మీకు పెద్ద మొత్తంలో గిరాకీ లభిస్తుంది. అదే విధంగా మీరు షాపులో షుగర్ కేన్ జ్యూస్ తాగడం వల్ల కలిగే లాభాలను ఫ్లెక్సీ రూపంలో ఏర్పాటు చేసినట్లయితే, ఆయా జబ్బులతో బాధపడేవారు రెగ్యులర్గా మీ వద్దకు కస్టమర్లుగా మారి జ్యూస్ తాగేందుకు ఇష్టపడే అవకాశం ఉంటుంది.