6 months maternity leaves: ఇక మీదట వారికి కూడా 6 నెలల సెలవులు.. మరో గుడ్ న్యూస్ చెప్పిన మోదీ సర్కారు..

Pm modi:  కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేస్తున్న మహిళ ఉద్యోగులకు నరేంద్ర మోదీ తీపికబురు చెప్పారు. ఇప్పటివరకు ప్రెగ్నెంట్ మహిళలకు ఆరునెలల పాటు మెటర్నిటీ సెలవులు ఇస్తున్న విషయం తెలిసిందే.

1 /6

సాధారణంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు  ప్రభుత్వ శాఖలలో పనిచేసే మహిళ ఉద్యోగులకు ఆరునెలల పాటు వేతనంతో కూడిన మెటర్నీటి సెలవులు ఇస్తుంటాయి. ఇది ఆయా రాష్ట్రాలలో సెలవుల్లో కాస్త ఎక్కువ, తక్కువగాను ఉండవచ్చు. చాలా వరకు ఆరు నెలల పాటు సెలవులు ఉంటాయి.

2 /6

ఈ నేపథ్యంలో మోదీ సర్కారు సరోగసీ ప్రెగ్నెంట్ మహిళల విషయంలో కూడా కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి వీరికి కూడా ఆరునెలల పాటు మెటర్నీటీ లీవ్ అప్లికేబుల్ చేస్తు ఉత్తర్వులు జారీచేసింది. సాధారణంగా ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో పనిచేసే మహిళలు ఎవరికైనా గర్భిణీ అయిన తర్వాత ప్రసూతి సెలవులు ఇవ్వాలని చట్టం కూడా ఉంది.

3 /6

కేవలం మహిళా ఉద్యోగులకే కాకుండా.. మగవారికి కూడా కొన్ని సంస్థలలో పితృత్వ సెలవులు ఉంటాయి. అయితే మహిళలతో పోలిస్తే ఇవి చాలా తక్కువగా ఉంటాయి. ఇవి ఆయా సంస్థల పాలసీని బట్టి ఎక్కువగాను, తక్కువగాను ఉంటాయి.  తాజాగా కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం మరో కీలక  నిర్ణయం తీసుకుంది. అద్దె విధానంతో ప్రెగ్నెంట్ (సరోగసీ) ద్వారా తల్లులు అయిన వారికి కూడా మెటర్నిటీ లీవులు ఇవ్వాలని నిర్ణయించింది.

4 /6

సరోగసీ ద్వారా తల్లులైనా ప్రభుత్వ మహిళా ఉద్యోగులు ఇక నుంచి 6 నెలల ప్రసూతి సెలవులు తీసుకోవచ్చని కేంద్రం తాజాగా వెల్లడించింది. దీని కోసం.. చట్టంలోని 50 ఏళ్ల నాటి నిబంధనను తాజాగా కేంద్ర ప్రభుత్వం సవరించింది. సెంట్రల్ సివిల్ సర్వీసెస్ (సెలవులు) రూల్స్ 1972లో మార్పులు చేసింది.

5 /6

తాజాగా  చేసిన  మార్పుల ప్రకారం.. తల్లి (సరోగసీ ద్వారా బిడ్డకు జన్మనిచ్చే తల్లి) పిల్లల సంరక్షణ కోసం ఈ 6 నెలల పాటు సెలవులు తీసుకునే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా.. తండ్రి కూడా 15 రోజుల పితృత్వ సెలవులు తీసుకోవచ్చు. అయితే వారికి ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ మంది సంతానం ఉండకూడదని కేంద్రం షరతు మాత్రం విధించింది.

6 /6

ఇక ఈ మార్పులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం గత వారమే నోటిఫికేషన్ జారీ చేయగా.. జూన్ 18 వ తేదీ నుంచే ఈ నిర్ణయం అమల్లోకి వచ్చింది. ప్రస్తుతం సమాజంలో సరోగసీ కేసులు ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలో..మహిళా ఉద్యోగులకు కూడా ప్రయోజనం కల్పించేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.వీటిని పిల్లల అవసరాలు, చదువు, అనారోగ్యం సహా ఇతర సమయాల్లో ఈ లీవులను వాడుకోవచ్చని కేంద్రం ఒక ప్రకటనలో వెల్లడించింది.