Amaravati: ఆంధ్రుల రాజధాని అమరావతి ఇప్పుడు ఎలా ఉందో చూశారా?

How Is There Capital Amaravati You Looks Once: విభజనతో రాజధాని కోల్పోయిన ఆంధ్రప్రదేశ్‌కు 2015లో అమరావతిగా రాజధానిగా ప్రకటించుకున్నారు. అయితే జగన్‌ అధికారంలోకి రావడంతో అమరావతి ఆగిపోయింది. తాజాగా చంద్రబాబు అధికారంలోకి రావడతో మళ్లీ అమరావతి ఊపిరి పోసుకుంది. ఇప్పుడు అమరావతి ప్రాంతం ఎలా ఉందో చూడండి.

1 /10

Amaravati: తెలంగాణ రాష్ట్ర విభజనతో 2014లో ఆంధ్రప్రదేశ్‌కు రాజధాని లేకుండాపోయింది. నాడు అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు రాజధాని కోసం తీవ్రంగా అన్వేషించారు.

2 /10

Amaravati: చాలా ప్రాంతాలు పరిశీలించిన తర్వాత కృష్ణా, గుంటూరు జిల్లాల మధ్య వెలగపూడి, ఉద్దండరాయునిపాలెం తదితర ప్రాంతాలను కలిపి రాజధానిగా ప్రకటించారు.  

3 /10

Amaravati: 22 అక్టోబర్‌ 2015 నాడు దసరా పండుగ రోజు అమరావతి రాజధాని నిర్మాణానిక శంకుస్థాపన చేశారు. ప్రధానమంత్రిగా ఉన్న నరేంద్ర మోదీ, నాటి తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు తదితరులు హాజరయ్యారు.

4 /10

Amaravati: 2019 ఎన్నికల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చింది. ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఎన్నికయ్యారు. అయితే అమరావతి ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేసి మూడు రాజధానులు అంటూ సరికొత్త ప్రతిపాదన చేశారు.

5 /10

Amaravati: ఇక అప్పటి నుంచి రాజధాని అమరావతి నిర్మాణం మూలకు చేరింది. నాడు శంకుస్థాపన చేసిన రాజధాని ప్రాంతం కంపచెట్లతో నిండి ఒక అడవిని తలపిస్తోంది.

6 /10

Amaravati: ఎన్నో ప్రణాళికలతో నిర్మించిన భవనాలు పాడుబడ్డాయి. నిర్మాణ సామగ్రి, పైపులైన్లు, ఇనుము తదితర వస్తువులు దొంగతనానికి గురయ్యాయి.

7 /10

Amaravati: రాజధానిగా అమరావతి కొనసాగాలని రాజధాని ప్రాంత రైతులు 1600 రోజులు సుదీర్ఘ ఉద్యమం నడిపారు.

8 /10

Amaravati: నాడు అంకురార్పణ చేసిన చంద్రబాబు నేడు మళ్లీ ముఖ్యమంత్రి కావడంతో అమరావతి ఊపిరి పీల్చుకుంది.  

9 /10

Amaravati: రాజధాని ప్రాంత పరిశీలనకు చంద్రబాబు వెళ్లిన సమయంలో అక్కడి పరిస్థితులు దయనీయంగా మారాయి.  

10 /10

Amaravati: వాటిని చూసి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆవేదన చెందారు. రాజధాని కావాల్సిన ప్రాంతం ఎలా తయారయ్యిందనోనని బాధపడ్డారు.